Asianet News TeluguAsianet News Telugu

బంపర్ ఆఫర్..రూ.1కే హానర్ 8ప్రో స్మార్ట్ ఫోన్

హానర్‌ సూపర్‌  సేల్‌లో తన 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 14 తేదీన కేవలం 1 రూపాయికే  అందిస్తోంది.

honor8 pro smart phone available just for rs.1.. limited offer
Author
Hyderabad, First Published Aug 14, 2018, 2:17 PM IST

మీరు సెల్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ బంపర్ ఆఫర్ మీకే. కేవలం రూ.1కే స్మార్ట్ ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు. ఈ బంపర్ ఆఫర్ ని ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ హానర్ అందిస్తోంది.

హానర్‌ సూపర్‌  సేల్‌లో తన 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 14 తేదీన కేవలం 1 రూపాయికే  అందిస్తోంది. హానర్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా ఈ రోజు ( మంగళవారం) 11.30 నిమిషాలకు ఈ సూపర్‌ సేల్‌ మొదలు కానుందని ప్రకటించింది. స్టాక్‌ ఉన్నంత వరకే ఈ అవకాశంమని తెలిపింది.   హానర్‌ 8 ప్రొ వాస్తవ ధర రూ.29,999 అంటే  రూ.29,998ల భారీ  డిస్కౌంట్‌ అన్నమాట. అయితే కేవలం కొన్ని నిమిషాల్లోనే  సోల్డ్‌ అవుట్‌ అన్న డైలాగ్‌ కస‍్టమర్లను వెక్కిరించడం గమనార‍్హం​.  ఈ స్వల్ప వ్యవధిలో ఎన్ని స్మార్ట్‌ఫోన్లను  తమ కస‍్టమర్లకు అందించిందనే లెక్కలను సంస్థ అధికారికంగా ప్రకటించాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios