Asianet News TeluguAsianet News Telugu

ఐఫోన్ యూసర్లకు గుడ్ న్యూస్.. మాస్క్ తో ఫేస్ అన్‌లాక్ కోసం సరికొత్త అప్ డేట్..

అమెరికన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ ఐ‌ఓ‌ఎస్ యూసర్ల కోసం  ఐ‌ఓ‌ఎస్  14.5  బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. 

Great update for apple  iPhone users, Face Unlock will work even after wearing mask
Author
Hyderabad, First Published Feb 2, 2021, 1:17 PM IST

 మీకు ఆపిల్ ఐఫోన్  ఉందా.. ఫేస్ మాస్క్ కారణంగా ఫోన్‌ను అన్‌లాక్ చేయడంలో ఇబ్బంది ఉంటే మీకో గుడ్ న్యూస్. అమెరికన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ ఐ‌ఓ‌ఎస్ యూసర్ల కోసం  ఐ‌ఓ‌ఎస్  14.5  బీటా వెర్షన్‌ను విడుదల చేసింది.

ఈ కొత్త అప్ డేట్ ద్వారా అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఫేస్ మాస్క్ ధరించిన కూడా మీరు మీ ఐఫోన్‌ను ఫేస్ ఐడితో అన్‌లాక్ చేయగలరు. ఐ‌ఓ‌ఎస్ 14.5 కు అప్ డేట్ తో అనేక ఇతర సమస్యలు పరిష్కరించబడ్డాయి. ఇది కాకుండా 5జి సపోర్ట్ కూడా విడుదల చేసింది.

ఫేస్ అన్‌లాక్ మాస్క్ తో ఎలా పని చేస్తుంది?
ఆపిల్ ఐఫోన్‌ కొత్త అప్ డేట్ లో మాస్క్‌తో ఉన్న ఫేస్ ఐడితో ఫోన్ ను అన్‌లాక్ చేయవచ్చు, కాకపోతే దానిలో చిన్న సమస్య ఉంది. సమస్య ఏమిటంటే, కొత్త అప్ డేట్ చేసుకున్నా తర్వాత ఫేస్ మాస్క్ ఉన్నవారు వారి ఐఫోన్‌ను ఆపిల్ వాచ్ ద్వారా అన్‌లాక్ చేయవచ్చు  తర్వాత మీ ఫోన్ ఫేస్ ఐ‌డి  ద్వారా ఫోన్ అన్‌లాక్ అవుతుంది. 

also read ఫిబ్రవరి 8న షియోమి ఎం‌ఐ 11 గ్రాండ్ లాంచ్.. అదిరిపోయే ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ.. ...

ఐఫోన్ అన్‌లాక్ అయిన తర్వాత మీ స్మార్ట్‌వాచ్‌లో హాప్టిక్ వైబ్రేషన్  ఉంటుంది, ఇది మీ ఫోన్  ఫేస్ ఐ‌డి ఆన్ లక్ ని నిర్ధారిస్తుంది. ఐ‌ఓ‌ఎస్ 14.5 అప్ డేట్ తర్వాత ఈ ఫీచర్ స్వయంచాలకంగా పనిచేయదు. మీరు దీన్ని మాన్యువల్‌గా ఆన్ చేయాలి.

అయితే ఈ అప్‌డేట్ తర్వాత కూడా ఈ ఫేస్ అన్‌లాక్,  కొన్ని ముఖ్యమైన పనులు చేయలేమని ఆపిల్ తెలిపింది. ఈ కొత్త అప్ డేట్ ప్రతి ఒక్కరికీ కాదు, ఆపిల్ వాచ్ ఉన్నవారికి మాత్రమే  ఈ అప్ డేట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

 ఫేస్ మాస్క్ ఉన్నపుడు  ఫేస్ అన్‌లాక్ సమస్యను పరిష్కరించడానికి ఆపిల్ ఈ కొత్త అప్ డేట్  విడుదల చేయడం ఇది మొదటిసారి కాదు. గత ఏడాది మేలో కూడా  ఆపిల్ ఒక అప్ డేట్ విడుదల చేసింది. దానిలో మాస్క్ ధరించినప్పుడు ఫేస్ ఐడి  ఆన్ లాక్ కోసం వెంటనే పాస్‌కోడ్ అడుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios