మీరు ఐ‌సి‌ఐ‌సి‌ఐ కార్డ్, ఐ‌డి‌ఎఫ్‌సి కార్డ్, వన్ కార్డ్, ఎస్‌బి‌ఐ బ్యాంక్ కార్డ్‌తో చెల్లిస్తే మీరు రూ. 5,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు, ఆ తర్వాత ఫోన్  ధర రూ.20,990 చేరుతుంది. వివో  ఆన్‌లైన్ స్టోర్ నుండి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో (Vivo) వి23 సిరీస్ ఎవర్‌గ్రీన్ సిరీస్. ఈ సిరీస్ కింద చాలా ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లోని ఒక ఫోన్ Vivo V23e 5G ప్రస్తుతం రూ. 5,000కు చౌకగా లభిస్తోంది. వివో కంపెనీ వివో వి23ఈ 5Gపై సమ్మర్ స్పెషల్ ఆఫర్‌గా రూ. 5,000 క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. వివో వి23ఈ 5G తాజాగా ఇండియాలో మూడు వెనుక కెమెరాలతో AMOLED డిస్ ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో ఆవిష్కరించారు. ఈ ఫోన్‌లో 44 మెగాపిక్సెల్‌ల ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

 కొత్త ధర
వివో వి23ఈ 5G ధర రూ. 25,990. 8జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్‌లో మిడ్‌నైట్ బ్లూ, సన్‌షైన్ గోల్డ్ కలర్స్ లో లభిస్తుంది. సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద మే 10 వరకు, మీరు ICICI కార్డ్, IDFC కార్డ్, వన్ కార్డ్, SBI బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే మీకు రూ. 5,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది, ఆ తర్వాత ఫోన్ ధర రూ.20,990 దొగోస్తుంది. Vivo ఆన్‌లైన్ స్టోర్ నుండి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్‌లు
వివో వి23ఈ 5G Android 12 ఆధారిత Funtouch OS 12, 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.44-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లే, MediaTek డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 8జి‌బి వరకు ర్యామ్, 128జి‌బి వరకు స్టోరేజ్ పొందుతుంది.

కెమెరా
ఈ ఫోన్‌లో మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌లు. రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మాక్రో. సెల్ఫీల కోసం 44-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ
వివో వి23ఈ 5జిలో 5G, 4G LTE, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.1, GPS / A-GPS, USB టైప్-C పోర్ట్‌ ఉంది. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. దీనిలో 44W FlashCharge ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 4050mAh బ్యాటరీ ప్యాక్ చేస్తుంది.