ఫిట్‌నెస్ టెక్నాలజీ ప్లేయర్ గోకి శుక్రవారం గుండె ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి రూపొందించిన వైటల్ ఇసిజి అనే ఫిట్‌నెస్ ట్రాకర్‌ను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సమక్షంలో ప్రారంభించారు దీని ధర రూ. 4,999 ఉండగా ప్రస్తుతం   రూ. 2,999కి విక్రయిస్తున్నారు.

గోకి వైటల్ ఇసిజి ట్రైకోగ్ హెల్త్ ద్వారా ఇసిజి సంబందించిన  సమాచారాన్నిఅందిస్తుంది - ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజి ఇసిజి రీడింగులను తక్షణమే తెలియజేస్తుంది.తీవ్రమైన గుండె పరిస్థితులను గుర్తించే లక్షణాన్ని ఈ స్మార్ట్ బ్యాండ్ కు కలిగి ఉందని కంపెనీ తెలిపింది.

ట్రైకోగ్ ఆరోగ్యానికి సంభందించి లోతైన అభ్యాసం చేయటం ద్వారా ఇది సాధ్యమైంది - "డీప్ రిథమ్" అనే అరిథ్మియా డిటెక్షన్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. గోకి వైటల్ ఇసిజి  వినియోగదారులకు వారి సింగిల్-లీడ్ ఇసిజి ద్వారా ఖచ్చితమైన సమాచారం అందిస్తుంది.

గోకి వైటల్ ఇసిజి  ఇతర  ఫీచర్స్ స్లీప్ ట్రాకింగ్, ఎక్సైజ్ మోడ్ ఇంకా మొబైల్ ఫోన్ నోటిఫికేషన్లను చూపిస్తుంది. కొత్త గోకి స్మార్ట్ బ్యాండ్ ఒకసారి  ఛార్జింగ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ బాక్అప్ అందిస్తుందని పేర్కొంది. 

గోకి వైటల్ ఇసిజి స్మార్ట్ బ్యాండ్ ఇప్పుడు అమెజాన్.ఇన్ ద్వారా మూడు నెలల పాటు హెల్త్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ-రిటైలర్ ద్వారా ప్రస్తుతం దీనిని ధర రూ. 2,999  కానీ స్మార్ట్ బ్యాండ్ యొక్క ధర రూ. 2,000 అంటే వెయ్యి వరకు తగ్గింపు.

"గోకి వైటల్ ఇసిజి స్మార్ట్ బ్యాండ్ ద్వారా మేము ఆరోగ్య  వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాము. మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే సులభంగా ఈ‌సి‌జి సమాచారం తెలుసుకునేలా చేయటం" అని గోకి సంస్థ వ్యవస్థాపకుడు మరియు సి‌ఈ‌ఓ విశాల్ గొండాల్ ఒక ప్రకటనలో తెలిపారు.