జిమెయిల్, యుట్యూబ్, గూగుల్ డ్రైవ్, గూగుల్ అనల్టిక్స్ వంటి గూగుల్ సేవలు  నేడు భారతదేశంలో కొద్దికాలం పాటు అకస్మాత్తుగా నిలిపివేయడం వలన ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్న చాలా మందికి సమస్యలు ఎదురయ్యాయి. 

జిమెయిల్, యుట్యూబ్, గూగుల్ డ్రైవ్, గూగుల్ అనల్టిక్స్ వంటి గూగుల్ సేవలు ఈరోజు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో ఈ సేవలపై ఆధారపడిన కోట్లాది మంది డిజిటల్ యూజర్లు ప్రభావితమయ్యారు.

భారతదేశంలో చాలా మంది ఈ వెబ్‌సైట్‌లు పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. చాలా మంది గూగుల్ సర్వీసులు డౌన్ కావడంపై ట్వీట్లు కూడా చేశారు. కొందరు Gmail సైట్‌ని ఉపయోగించలేకపోతున్నట్లు ఇంకా 502 ఎర్రర్‌ను చూపిస్తుందని నివేదించారు. సాధారణంగా సర్వర్ లోపం వల్లే ఈ సమస్య వస్తుందని టెక్నాలజి నిపుణులు సూచిస్తున్నారు.

అయితే సమస్య తాత్కాలికమేనని, నిమిషాల్లోనే క్లియర్ అయిందని కొందరు అంటున్నారు. కానీ డౌన్ డిటెక్టర్ (Down Detector) అనే వెబ్‌సైట్ మాత్రం జీమెయిల్, యూట్యూబ్, డ్రైవ్ సేవలను డిసేబుల్ కావడంపై 2000కు పైగా ఫిర్యాదులు అందాయని తెలిపింది. Down Detector ఇంటర్నెట్ సేవల గురించి సమాచారాన్ని అందించే వెబ్‌సైట్.

ఫిబ్రవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయిన సంగతి మీకు తెలిసింది. చాలా మంది కొత్త ట్వీట్లు చేయలేకపోతున్నట్లు చెప్పారు. వారిలో కొందరికి మీరు ట్వీట్ చేయడానికి మీ డైలీ లిమిట్ చేరుకున్నారని స్క్రీన్‌పై మెసేజ్ కూడా వస్తుందిని తెలిపారు.

మరో ప్రముఖ టెక్నాలజి కంపెనీ మైక్రోసాఫ్ట్ సేవలకు కూడా గతంలో అంతరాయం ఏర్పడింది. దీని తరువాత, గూగుల్ కంపెనీకి చెందిన వివిధ సేవలు కూడా స్తంభించాయి, ఇది టెక్నాలజి పరిశ్రమను ఆందోళనకు గురిచేసింది.