తెలియని ఫోన్ నంబర్స్ నుండి కాల్స్ వస్తున్నయా.. అయితే ఆటోమేటిక్ గా ఇలా రికార్డు చేయండి..

తెలియని ఫోన్ నంబర్స్ లేదా కొత్త నంబర్స్ నుండి వస్తున్న కాల్స్ రికార్డు చేయలేకపోతున్నరా  అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు గూగుల్ ఒక కొత్త యాప్ ఫీచర్ తీసుకొచ్చింది.
 

google phone app update now lets you always record calls from unknown numbers not in your contacts

ఒకోసారి మనకు తెలియని నంబర్స్ నుండి ఫోన్ కాల్స్ వస్తుంటాయి లేదా మనమే తప్పుగా నంబర్  చేస్తుంటాం. అయితే ఇలాంటి సందర్భాల్లో ఒకోసారి మంచి లేదా తప్పు  కూడా జరుగువచ్చు. ఈ సమస్య ఎక్కువగా  తెలియని నంబర్లతోనే జరుగుతుంటాయి.

ఇలాంటప్పుడే  కొందరు కాల్ రికార్డింగ్ చేసి ఉంటే బాగుండేది అని కోరుకుంటుంటారు. ఈ సమస్యకు ఇప్పుడు టెక్నాలజి దిగ్గజం గూగుల్ ఒక పరిష్కరం తీసుకొచ్చింది. తెలియని నంబర్ నుండి కాల్ వస్తే రికార్డింగ్‌ను ఆటోమేటిక్ గా ఆన్ చేసే ఫీచర్ ను గూగుల్ ప్రారంభించింది.

ఈ ఫీచర్‌ గూగుల్ ఫోన్ యాప్‌లో ఇచ్చింది. అయితే గత సంవత్సరంలోనే  ఈ యాప్ లాంచ్ చేసినప్పటికీ, ఇప్పుడు ఈ ఫీచర్ సరికొత్త అప్‌డేట్‌తో  లభిస్తుంది. ఎక్స్‌డి‌ఏ డెవలపర్స్ నివేదిక ప్రకారం, గూగుల్ కొన్ని స్మార్ట్ ఫోన్లకు  ఈ  అప్ డేట్ కూడా విడుదల చేసింది.

also read ప్రపంచంలోనే మొట్టమొదటి 'డూ-ఇట్-ఆల్' స్క్రీన్‌తో శామ్‌సంగ్ స్మార్ట్ మానిటర్‌.. ఓ‌టి‌టి యాప్స్ కూడా సప...

అలాగే ఇతరు డివైజెస్ కోసం కూడా ఈ ఫీచర్ తీసుకురాబోతుంది. ఈ కొత్త అప్ డేట్ తరువాత గూగుల్ ఫోన్ యాప్ తెలియని నంబర్ల నుండి కాల్‌లను ఆటోమేటిక్ గా రికార్డ్ చేస్తుంది. సాధారణంగా గూగుల్ ఫోన్ యాప్ స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా గూగుల్ పిక్సెల్‌లకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీకు కావాలంటే దీనిని విడిగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ ఎలా  చేయాలి
1.గూగుల్ ఫోన్ యాప్ చూపిన మెను బటన్‌పై  క్లిక్ చేయండి.
2. ఇప్పుడు కాల్ రికార్డింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3.ఇప్పుడు మీ కాంటాక్ట్స్ లో లేని నంబర్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
4.దీని తరువాత ఆల్వేస్ రికార్డ్ ఆప్షన్ ఎంచుకోండి.

ఇప్పుడు గూగుల్  ఫోన్ యాప్ మీ ఫోన్‌లో తెలియని అన్ని నంబర్‌ల కాల్స్  ఆటోమేటిక్ గా రికార్డ్ చేస్తుంది, అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, రికార్డింగ్ ప్రారంభమైనప్పుడు మీకు, కాల్స్ చేసిన వ్యక్తి  ఇద్దరికీ  నోటిఫికేషన్‌లను పంపుతుంది. అంతేకాకుండా ఈ రికార్డింగ్ మీ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ లో మాత్రమే స్టోర్ అవుతుంది, మెమరీ కార్డ్‌లో ఉండదు. ఫోన్ స్టోరేజ్ నిండి ఉంటే రికార్డింగ్ అవ్వదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios