రకరకాల యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్ వాడుతుంటాం. అయితే ఈ స్టోర్స్ ప్రస్తుతుం 12లక్షల యాప్ల ను నిషేధించిందట.. ఎందుకంటే...

హానికరమైన యాప్స్ నుంచి యూజర్లకు మెరుగైన భద్రత కల్పించడం కోసం 12లక్షల యాప్ లను నిషేధించినట్లు గూగుల్ ప్రకటించింది. పాలసీలకు విరుద్ధంగా ఉన్న యాప్ లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా 2021లో మోసపూరిత, స్పామ్ డెవలపర్ లను నియంత్రించడానికి 1.90 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసినట్లు తెలిపింది. దీంతోపాటు ఇన్ యాక్టివ్ గా ఉన్న దాదాపు ఐదు లక్షల ఖాతాలను నిలిపివేసినట్లు గూగుల్ నివేదించింది.

వైరస్, మాల్వేర్ ఇతర సమస్యలు ఉన్నప్పుడు గూగుల్ కొన్ని యాప్స్ ను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే యూజర్ల భద్రతా కారణాల దృష్ట్యా వీటిని నిషేధించినట్లు గూగుల్ తన బ్లాగ్ పోస్టులో వివరించింది. ‘మాల్వేర్, హానికరమైన సాఫ్ట్వేర్ ల నుంచి యూజర్లకు రక్షణ కల్పించడానికి బిలియన్ల కొద్దీ ఇన్స్టాల్ చేసుకున్న యాప్ లను ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూనే ఉన్నాం’ అని పేర్కొంది. సెర్చ్ దిగ్గజం గూగుల్ యూజర్ల డేటా సేఫ్టీ కోసం మే నెలలో ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. యాపిల్ గోప్యత విభాగం ‘న్యూట్రిషన్ లేబుల్స్’ తరహాలోనే ఇది పనిచేస్తుంది. దీనిలో గూగుల్ ప్లే స్టోర్ లోని యాప్స్ లో గోప్యత, భద్రతా హక్కులకు సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. 

డెవలపర్లు యాప్ కు సంబంధించిన సమాచారాన్ని సమర్పించాలని గూగుల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా… నిషేధిత యాప్లు ఇంకా మీ ఫోన్లో ఉన్నాయో, లేదో తెలుసుకోవాలంటే గూగుల్, యాప్ స్టోర్ లోకి వెళ్లి యాప్ లో వివరాలు సరిచేసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో కనిపించినట్లైతే అవి నిషఏధిత యాప్ లు కాదని చెబుతున్నారు. ప్లే స్టోర్ లలో కనిపించకపోతే మొబైల్ నుంచి ఆ యాప్ ను వెంటనే డిలీట్ చేయాలి అని హెచ్చరిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, మొబైల్ లో నిత్యావసరాల కోసం కొన్ని రకాల యాప్స్ వాడుతుంటాం. అలాంటి వాటివల్ల ఈజీగా మోసపోవచ్చని మీకు తెలుసా.. అలాంటి నాలుగు రకాల యాప్స్ ఏంటంటే.. మొదటిది... ఫ్రీ యాంటీ వైరస్...మొబైల్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి ఎన్నో రకాల ఫ్రీ యాంటీ వైరస్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంటారు. అయితే ఈ యాప్‌లు మీ మొబైల్‌లో ప్రమాదాన్ని పెంచుతాయి. 

ఫ్లాష్ లైట్ యాప్ : చాలా మంది మొబైల్‌లో ఫ్లాష్ లైట్ యాప్‌ని విడిగా డౌన్‌లోడ్ చేస్తుంటారు, ఇందులో చాలా రకాల ఫీచర్లు ఉన్నాయి. కానీ ఈ యాప్‌లు మీ రహస్య సమాచారాన్ని దొంగిలిస్తాయని, దుర్వినియోగం చేస్తున్నాయని మీకు తెలియకపోవచ్చు. కాబట్టి వాటిని డౌన్‌లోడ్ చేయకుండా ఉండండి.

కీబోర్డ్ యాప్ : మీరు మొబైల్ కొనుగోలు చేసినప్పుడు బేసిక్ కీబోర్డ్ అందులో ఉంటుంది. అయితే ఈ కీబోర్డ్ సాధారణ కీబోర్డ్, కొందరు వ్యక్తులు మొబైల్‌కి ప్రత్యేక కీబోర్డ్‌ని యాడ్ చేస్తుంటారు. కొత్త ఎమోజి, కొత్త వ్రైటింగ్ స్టాయిల్ పొందేందుకు ఇలా చేస్తారు.

క్లీనర్ యాప్ : మనం మన మొబైల్‌ని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత ఎక్కువ క్యాచి అండ్ జంక్ ఫైల్స్ అందులోకి వస్తాయి. వాటిని డిలెట్ చేయడం కోసం ఎన్నో రకాల యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంటారు, ఈ యాప్స్ మీ నుండి మీ సమాచారాన్ని దొంగిలిస్తుంది.