Gmail ద్వారా బల్క్ ఇమెయిల్ పంపేవారి కోసం Google కొత్త సెక్యూరిటీ నియమాలను విధించింది. ఈ నియమాలు నేటి  ఏప్రిల్ 1 అమలులోకి వచ్చాయి.

ఇరవై సంవత్సరాల క్రితం ఏప్రిల్ 1 2004న Google ఇమెయిల్ సర్వీస్ Gmailను ప్రారంభమైంది. తరువాత Gmail వేగంగా నంబర్ వన్ ఇమెయిల్ సర్వీస్ గా మారింది. 20 సంవత్సరాల తర్వాత Gmail సర్వీస్ 1.2 బిలియన్ యూజర్లను పొందింది.

Gmail ద్వారా విడుదలైన ఒక పత్రికా ప్రకటనలో, Google సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ "యూజర్లు ఇమెయిల్ పంపడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఖచ్చితం చేయడానికి Google కట్టుబడి ఉంది. ఇతర ఉచిత వెబ్‌మెయిల్ సేవలలా కాకుండా, Gmail నిర్దిష్ట ఇమెయిల్ అడ్రస్ కనుగొనేలా రూపొందించబడింది." అని అన్నారు. 

ఇమెయిల్ సర్వీస్ వినియోగదారులలో అత్యధికంగా ఉపయోగించే ప్లాట్‌ఫారమ్‌గా Gmail ఉద్భవించిన తర్వాత, చాలా మంది వినియోగదారులు ఆన్ వాంటెడ్ ఇమెయిల్‌లను పొందడం గురించి ఫిర్యాదు చేశారు. 

దీన్ని దృష్టిలో ఉంచుకుని, Gmail ద్వారా బల్క్ ఇమెయిల్ పంపేవారి కోసం Google కొత్త సెక్యూరిటీ రూల్స్ విధించింది. ఈ రూల్స్ ఏప్రిల్ 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి.

బల్క్ ఇమెయిల్‌లను పంపాలనుకుంటే ఇమెయిల్ సర్వీస్ ప్రొవైడర్లు కఠినమైన పరిమితులకు లోబడి ఉండాలని ఫోర్బ్స్ నివేదిక సూచిస్తుంది.

కొత్త నిబంధనల ప్రకారం బల్క్ ఈమెయిల్స్ పంపేవారి నుండి వచ్చే ఇమెయిల్‌లను వారు అతేంటికేషన్ రిక్వైర్మెంట్స్ తీర్చకపోతే కొత్త నియమాలు తిరస్కరిస్తాయి. మార్కెటింగ్ ఇమెయిల్‌లు 5,000 పరిమితిని చేరుకున్న తర్వాత, అవి పర్మనెంట్ గా 'బల్క్ సెండర్స్'గా వర్గీకరించబడతాయి.

మల్టి సబ్-డొమైన్‌ల నుండి ఇమెయిల్‌లను పంపేటప్పుడు కూడా ఈ కొత్త నియమాలు వర్తిస్తాయని Google ఖచ్చితం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, సబ్-డొమైన్‌ల నుండి పంపబడిన అన్ని ఇమెయిల్‌లు ఒకే పేరెంట్ డొమైన్ నుండి పంపబడినట్లుగా లెక్కించబడతాయి.