Asianet News TeluguAsianet News Telugu

జీయో & మీడియా టెక్ ద్వారా 'గేమింగ్ మాస్టర్స్' కి అనూహ్య స్పందన.. ప్రైజ్ మని కింద 12.5 లక్షల బహుమతి

70 రోజుల ఈస్పోర్ట్స్ టోర్నమెంట్ 'గేమింగ్ మాస్టర్స్' ను ముగించింది. ఈ టోర్నమెంట్‌కి దేశవ్యాప్తంగా గేమింగ్ ప్రియుల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. 

gaming masters by jio and mediatek receives overwhelming response   prize pool of 12.5 lakhs awarded
Author
Hyderabad, First Published Mar 17, 2021, 7:05 PM IST

ముంబై 17 మార్చి 2021: జియో అండ్ మీడియాటెక్ 70 రోజుల ఈస్పోర్ట్స్ టోర్నమెంట్ 'గేమింగ్ మాస్టర్స్' ను ముగించింది. ఈ టోర్నమెంట్‌కి దేశవ్యాప్తంగా గేమింగ్ ప్రియుల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. 13 జనవరి 2021న ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో గారెనా  ఫ్రీ ఫైర్ గేమ్ ఉంది.  సోలో, డ్యూయో విభాగాలతో 43 వేల టీంలతో 7 వారాల పాటు కొనసాగింది.


టూర్నమెంట్ హైలైట్స్: టోర్నమెంట్ ప్రారంభించినప్పుడు 43వేల టీంలు ఏర్పాటు చేశారు.

ఈ టోర్నమెంట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై జియో, నాన్ జియో సబ్ స్క్రిబెర్స్ నుండి 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 
ఈ మొత్తం టోర్నమెంట్ జియో టి‌వి హెచ్‌డి ఈస్పోర్ట్స్ ఛానల్, బూయా, యూట్యూబ్‌లో హిందీ ఇంకా ఇంగ్లీషులో లైవ్ ప్రసారం చేశారు.
టీం హెడ్ హంటర్స్ గేమింగ్ మాస్టర్స్ గెలుచుకున్నారు. వీరికి 3 లక్షల రూపాయల ఫ్రిజ్ మనీతో పాటు గేమింగ్ మాస్టర్స్ టైటిల్ పొందారు.

మీడియాటెక్‌తో భాగస్వామ్యం గర్వించదగినది:

"జియో గేమ్స్  ఆధారిత రివొల్యూషనరీ ఈస్పోర్ట్స్ టోర్నమెంట్ 'ఫ్రీ ఫైర్ గేమింగ్ మాస్టర్స్' ను విజయవంతంగా నిర్వహించినందుకు మీడియాటెక్ కి గర్వంగా ఉంది. 43000పైగా రిజిస్టర్డ్ టీంలతో, ఈస్పోర్ట్స్ టోర్నమెంట్ ప్రజల నుండి అద్భుతమైన స్పందనను పొందింది, అలాగే అతిపెద్ద వాటిలో ఒకటిగా అవతరించింది. జియో గేమ్స్ ఈస్పోర్ట్స్ టోర్నమెంట్ ఆధారిత ఫ్రీ ఫైర్ గేమింగ్ మాస్టర్స్ గెలుపు భారతదేశంలో పెరుగుతున్న ఈ-స్పోర్ట్స్ పరిశ్రమ ప్రజాదరణను పునరుద్ఘాటిస్తుంది, ఇంకా వినియోగదారులలో గణనీయమైన పెరుగుదలను చూస్తోంది. సి‌ఎం‌ఆర్ నివేదిక ప్రకారం, మొబైల్ గేమింగ్ వినియోగదారుల సంఖ్య 2021 నాటికి 748 మిలియన్లను దాటుతుంది.

ఇంకా జియో గేమ్స్  శక్తినిచ్చే ఫ్రీ ఫైర్ గేమింగ్ మాస్టర్స్ వంటి ఈస్పోర్ట్స్ టోర్నమెంట్లు దేశవ్యాప్తంగా కొత్త గేమర్స్ ప్రతిభను ప్రదర్శించడానికి, వారి కలలను నెరవేర్చడానికి ఒక వేదికను అందించడంలో మాకు సహాయపడతాయి ”అని మీడియాటెక్ ప్రతినిధి అన్నారు.


మాస్టర్స్: టీం హెడ్ హంటర్స్ - సత్యం అండ్ నీలేష్

"ఇది మాకు గొప్ప అనుభవం, మా ప్రతిభను ప్రదర్శించడానికి వేదికను అందించినందుకు జియో గేమ్స్, మీడియాటెక్ కి ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్ 2 నెలలకు కొనసాగింది, మేనేజ్మెంట్ నిర్వహణకు భారీ కృతజ్ఞతలు. మాకు గొప్ప ప్రారంభం లేనప్పటికి మూడవ మ్యాప్ మాకు అద్భుతంగా మారింది, ఆ తర్వాత మేము చాలా స్థిరమైన పనితీరును కనబరిచము. మాకు బూయా ఉన్న  కలహరి మ్యాప్ మా పాయింట్లను పెంచడానికి, టేబుల్ టాపర్స్ కావడానికి చాలా సహాయపడింది.

ఈస్పోర్ట్స్‌లో విజయానికి నిలకడగా ఉండడం కీలకం అని మీకు తెలుసు, అలాగే మేము కూడా స్థిరంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాము, ఏదైనా గేమ్ ముందస్తు ఎలిమినేషన్ ఎదుర్కొంటే మేము మా స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉండేది. అలాగే మీరు పెద్ద వేదికపై  ఆడుతున్నపుడు మీరు తప్పులు చేయాలని కోరుకోరు.

గ్రాండ్ ప్రైజ్ కోసం టాప్ 24 జట్లు పోటీ పడుతున్నప్పుడు పోటీ చాలా తీవ్రంగా ఉంది. గేమర్స్ వారి నైపుణ్యాలను, ప్రతిభను ప్రదర్శించడానికి ఒక వేదిక కోసం  ఎదురుచూస్తుంటారు. అలాంటి వారి కోసం జియో గేమ్స్  ఈ గొప్ప వేదికను అందించింది, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని టోర్నమెంట్లను జియో గేమ్స్ నుండి ఎదురుచూస్తాం. 

Follow Us:
Download App:
  • android
  • ios