Asianet News TeluguAsianet News Telugu

డ్రాగన్’కు షాక్: భారత్ వైపే ఆపిల్ మొగ్గు.. బిలియన్ డాలర్ల పెట్టుబడులు !

తైవాన్ కేంద్రంగా పని చేస్తున్న 'ఫాక్స్​కాన్' సంస్థ భారత్​లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. టెక్ దిగ్గజం ఆపిల్​ సంస్థకు చెందిన ఐ ఫోన్లు తయారు చేసేందుకు భారతదేశంలో రూ.7,500 కోట్లకు పైగ (బిలియన్ డాలర్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఓ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది.

Foxconn to invest $1 billion in India amid Apple's gradual production shift from China
Author
New Delhi, First Published Jul 12, 2020, 10:56 AM IST

న్యూఢిల్లీ: తైవాన్ కేంద్రంగా పని చేస్తున్న 'ఫాక్స్​కాన్' సంస్థ భారత్​లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. టెక్ దిగ్గజం ఆపిల్​ సంస్థకు చెందిన ఐ ఫోన్లు తయారు చేసేందుకు భారతదేశంలో రూ.7,500 కోట్లకు పైగ (బిలియన్ డాలర్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఓ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది.

ఈ కథనం ప్రకారం తమిళనాడులో ఫాక్స్​కాన్​కు ఇప్పటికే ఉన్న ఐ-ఫోన్ల తయారీ ప్లాంట్​ను విస్తరించేందుకు ఈ పెట్టుబడులను వినియోగించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే మూడేళ్లలో ఈ పెట్టుబడులను పెట్టే అవకాశం ఉంది. 

ఇటీవల అమెరికా, చైనా మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు ఆపిల్ ఫోన్లకు చైనా అతిపెద్ద తయారీదారుగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో చైనాపై ఆధారపడటం తగ్గించుకోవాలని ఆపిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం భారత్​ను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఫాక్స్​కాన్​కు చైనా బయట ఉత్పత్తి పెంచమని ఒత్తిడి కూడా పెరిగినట్లు సమాచారం. ఫలితంగానే భారత్​లో ఈ పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

also read:నేటి కార్ల ‘ఆవిష్కరణ’ల కనువిందు.. వెహికిల్స్ మార్కెట్ మళ్లీ బిజీబిజీ..

పాక్స్​కాన్ ప్రస్తుతం తమిళనాడులోని శ్రీపెరుంబదూర్​ ప్లాంట్​లో ఐఫోన్ ఎక్స్​ఆర్, యాపిల్ బడ్జెట్ ఫోన్ క్లాస్-ఐఫోన్ వంటి మోడళ్లను తయారు చేస్తోంది. ఐఫోన్ ఎస్​ఈ, ఇతర పాత మోడళ్లనూ తయారు చేసేది. అయితే వీటి తయారీని ఆపిల్ ప్రపంచవ్యాప్తంగా ఇటీవలే నిలిపివేసింది.

ఈ ఏడాదే విడుదల చేసిన ఎస్​ఈ 2020ని కూడా చెన్నైలోనే తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. 

కొత్తగా వచ్చే పెట్టుబడులతో ఈ ప్లాంట్​లో మరో 6,000 మందికి ఉపాధి కల్పించే వీలుందని ఫాక్స్​కాన్​ ప్రతినిధులు తెలిపారు.భారత్​ స్మార్ట్​ఫోన్​ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న షియోమీ ఫోన్లను కూడా దేశీయంగా ఫాక్స్​కాన్ సంస్థే తయారు చేస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios