ఫ్లిప్ కార్ట్ మరో బంపర్ ఆఫర్.. ఈనెల 25న సూపర్ సేల్

First Published 23, Aug 2018, 9:51 AM IST
Flipkart Superr Sale to Be Held on August 25: Offers on Smartphones, Gadgets, and More
Highlights

ఈ సేల్‌లో ప్రతి గంటకు పలు రకాల ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందివ్వనున్నారు. హోమ్ డెకార్, బ్యూటీ, క్లాతింగ్, యాక్ససరీలు తదితర ప్రొడక్ట్స్‌ను బెస్ట్ ప్రైస్‌కు అమ్మనున్నారు.

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ 

ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 25వ తేదీన తన సైట్‌లో సూపర్ సేల్ పేరిట వన్ డే సేల్‌ను నిర్వహించనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఈ సేల్ ఒక్క రోజు ముందుగానే.. అంటే.. 24వ తేదీనే అందుబాటులోకి వస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో భాగస్వామ్యం అయిన ఫ్లిప్‌కార్ట్ ఆ బ్యాంక్‌కు చెందిన కస్టమర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందివ్వనుంది. అందుకు గాను వారు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆడియో డివైస్‌లు, కెమెరాలపై ఈ ఆఫర్‌ను అందిస్తున్నారు.

ఈ నెల 24వ తేదీన రాత్రి 9 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఈ సూపర్ సేల్ అందుబాటులోకి వస్తుంది. అర్థరాత్రి దాటిన తరువాత పూర్తి స్థాయిలో సేల్ ప్రారంభమవుతుంది. సేల్‌లో భాగంగా ఆగస్టు 25వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు రెడ్‌మీ 5ఎ స్మార్ట్‌ఫోన్‌కు గాను ఫ్లాష్ సేల్ నిర్వహిస్తారు. ఇక టీవీలు, గృహోపకరణాలు, ల్యాప్‌టాప్‌లు, ఆడియో డివైసెస్, కెమెరాలపై 70 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

ఈ సేల్‌లో ప్రతి గంటకు పలు రకాల ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందివ్వనున్నారు. హోమ్ డెకార్, బ్యూటీ, క్లాతింగ్, యాక్ససరీలు తదితర ప్రొడక్ట్స్‌ను బెస్ట్ ప్రైస్‌కు అమ్మనున్నారు. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కుక్‌వేర్‌పై 40 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తారు.

loader