డిజిటల్ పేమెంట్ లోకి ఫేస్ బుక్ పే...

ఫేస్  బుక్   కంపెనీ తన సొంత పేమెంట్ యాప్ ని ప్రకటించింది. ఇది మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ప్రధాన ఫేస్‌బుక్ యాప్‌లో పని చేస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ యుఎస్‌ లో లాంచ్ చేశారు.

Facebook Pay, a new form of payments service has been announced by the company

ఫేస్‌బుక్ పే, డిజిటల్ పేమెంట్ రంగంలోకి  ఫేస్ బుక్ అడుగు పెట్టింది. ఫేస్  బుక్   కంపెనీ తన సొంత పేమెంట్ యాప్ ని ప్రకటించింది. ఇది మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ప్రధాన ఫేస్‌బుక్ యాప్‌లో పని చేస్తుంది.

ప్రస్తుతం ఈ యాప్ యుఎస్‌ లో లాంచ్ చేశారు. ఇది ఫేస్‌బుక్, మెసెంజర్  యాప్ లతో  ప్రారంభమవుతుంది. ఫేస్‌బుక్ ఈ సేవలను యుఎస్  మార్కెట్లకు ఎప్పుడు తీసుకువస్తుందో స్పష్టంగా తెలియదు. ఫేస్‌బుక్‌ సొంతమైన వాట్సాప్‌, మెసెంజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా డిజిటల్‌ లావాదేవీల సౌలభ్యాన్ని త్వరలోనే వినియోగదారులకు అందించనుంది. 

aslo read అమ్మో!! ఇండియాలో బిజినెస్ చేయలేం: సీఈఓ...

Facebook Pay, a new form of payments service has been announced by the company

మార్కెట్ ప్లేస్ అండ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ డెబోరా లియు "ఎక్కువ మందికి, ఎక్కువ ప్రదేశాలకు ఈ ఫేస్ బుక్ పే సదుపాయాన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నామని'  మంగళవారం ఒక ప్రకటనలో  తెలిపారు. మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో పనిచేసే కొత్త చెల్లింపుల వ్యవస్థను త్వరలోనే తీసుకురానున్నామని చెప్పారు.

ఫేస్‌బుక్ పే దాదాపు అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు పేపాల్‌ ద్వారా  చెల్లింపులను చేసుకోవచ్చని అలాగే ఈవెంట్ టిక్కెట్లు, ఇతర కొనుగోళ్లతోపాటు, వ్యక్తుల మధ్య నగదు లావాదేవీలు కూడా చేసుకోవచ్చు. అలాగే అమెరికాలో వచ్చే వారం నుంచి మెసేంజర్‌, ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో వివిధ బిజినెస్‌ల కొనుగోళ్లు చేసుకోవచ్చని  డెబోరా లియు తెలిపారు. 

aslo read ఇంత అద్మానమ సీఈఓ? సలీల్ పరేఖ్‌పై మరో ప్రజావేగు

Facebook Pay, a new form of payments service has been announced by the company

ఫేస్‌బుక్ పే ఎలా  ఉపయోగించాలి ? 
ఫేస్‌బుక్‌  యాప్‌​ లేదా వెబ్‌సైట్‌లోని "సెట్టింగ్‌" అనే  ఆప్షన్‌పై క్లిక్‌ చేసి ఆపై "ఫేస్‌బుక్ పే" కు వెళ్లి, చెల్లింపు పద్ధతిని జోడించి లావాదేవీ పూర్తి చేయవచ్చు. అంతేకాదు వినియోగదారులు డబ్బు పంపేటప్పుడు లేదా చెల్లింపు చేసేటప్పుడు అదనపు భద్రత కోసం పిన్ నెంబర్, టచ్ లాక్ లేదా ఫేస్ ఐడి గుర్తింపు లాంటి  బయోమెట్రిక్‌ ఆప్షన్లు సెట్ చేసుకోవచ్చు.

భారతదేశంలో ఫేస్ బుక్ వాట్సాప్ పే, పీర్-టు-పీర్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇటీవల ఫేస్‌బుక్‌  ఫౌండర్‌ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios