త్వరలో ఎలాన్ మస్క్ కొత్త స్మార్ట్‌ఫోన్.. ? ఆపిల్-శామ్‌సంగ్‌కి పోటీగా లాంచ్..
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎలాన్ మస్క్ తీసురనున్న కొత్త ఫోన్ ఆపిల్, గూగుల్, శాంసంగ్ వంటి దిగ్గజాలతో పోటీపడవచ్చు. తాజాగా ఓ ట్వీట్‌కు సమాధానంగా యాపిల్ కి ప్రత్యామ్నాయ ఫోన్‌ను తీసుకువస్తామని తెలిపారు.
టెస్లా సిఈఓ, ట్విట్టర్ కొత్త అధినేత ఎలోన్ మస్క్ తనకి కొంచెం ఇబ్బంది కలిగించే ప్రతిదాన్ని కొనాలని లేదా ఉత్పత్తి చేయాలని అనుకుంటాడేమో. ప్రపంచంలోనే అతి పెద్ద మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ఎలోన్ మస్క్ ఫేక్ అకౌంట్‌లు, ఇతర కారణల ఇబ్బంది ఎదురుకోవడంతో ఎట్టకేలకు ట్విట్టర్‌ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ట్విట్టర్‌లో బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ వంటి పెద్ద మార్పులతో సహా నిరంతరం కొత్త మార్పులు చేస్తున్నారు. తాజాగా ఎలోన్ మస్క్ స్వంత స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతున్నాట్లు ఒక నివేదిక పేర్కొంది.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎలాన్ మస్క్ తీసురనున్న కొత్త ఫోన్ ఆపిల్, గూగుల్, శాంసంగ్ వంటి దిగ్గజాలతో పోటీపడవచ్చు. తాజాగా ఓ ట్వీట్‌కు సమాధానంగా యాపిల్ కి ప్రత్యామ్నాయ ఫోన్‌ను తీసుకువస్తామని తెలిపారు. ఆపిల్ అండ్ గూగుల్ ప్లే స్టోర్ నుండి ట్విట్టర్ తొలగింపుపై ట్విట్టర్‌లో చర్చ జరిగింది, దానికి సమాధానంగా ఎలోన్ మస్క్ కొత్త ఫోన్ తీసుకువస్తానని చెప్పారు.
ఎలోన్ మస్క్ చేసిన ట్వీట్‌లో, "అలాంటి పరిస్తితి రాదని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను, వేరే ఎంపిక లేకపోతే నేను సమాధానం అవును అనే చెప్తాను, ప్రత్యామ్నాయ ఫోన్‌ను తయారు చేస్తాను." కొంతమంది యూజర్లు Apple అండ్ Google ఆపరేటింగ్ సిస్టమ్ పట్ల "పక్షపాత" వైఖరిని ఆరోపించడంతో ఈ మొత్తం చర్చ మొదలైంది.
ఎలోన్ మస్క్ ప్రస్తుతం స్పేస్ ట్రావెల్, ఎలక్ట్రిక్ వాహనాలు, భవన నిర్మాణం, సోషల్ మీడియా వంటి వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిలో ఎలాన్ మస్క్ అదృష్టాన్ని ప్రయత్నించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
ఆపిల్ అండ్ గూగుల్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్‌ను చాలా కాలంగా ఆక్రమించాయి. దాదాపు 15 సంవత్సరాలుగా, Android అండ్ iOS ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్ ని పాలిస్తోంది.