ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో ఆ అక్కౌంట్స్ పై నిషేధం ఎత్తివేత..
ఎలోన్ మస్క్ ఎవరి అక్కౌంట్స్ త్వరలో మళ్ళీ ట్విట్టర్‌లోకి తిరిగి వస్తాయి అనేది ట్వీట్ లో స్పష్టం చేయలేదు. ట్విట్టర్‌లో సస్పెండ్ చేసిన కొన్ని ప్రాముఖుల అక్కౌంట్స్ లో కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్, అజీలియా బ్యాంక్స్, సింగర్ అభిజీత్ భట్టాచార్య ఉన్నారు.
టెస్లా సిఈఓ, ట్విట్టర్ కొత్త అధినేత ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో మరొక కొత్త పోల్ పోస్ట్ చేశాడు. ఈసారి అతను కొన్ని అక్కౌంట్స్ పై నిషేధాన్ని ఎత్తివేయాలా అని ఫాలోవర్స్ ని కోరారు. అయితే, చట్టాలను ఉల్లంఘించని లేదా ఎగ్రిజియస్ స్పామ్ లో ఎంగేజైన అక్కౌంట్స్ తిరిగి అర్హత పొందుతాయని ఆయన స్పష్టం చేశారు. ఎలోన్ మస్క్ నవంబర్ 23న ఈ పోల్ నిర్వహించారు అయితే ఇప్పటి వరకు 20 లక్షల మంది యూజర్లు ఈ పోల్‌లో పాల్గొన్నారు, ఇందుకు అవును అనే సమాధానానికి ఎక్కువగా ఓట్స్ వచ్చాయి. ఈ వారం ప్రారంభంలో ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో మరొక పోల్ కూడా నిర్వహించారు, అప్పుడు డొనాల్డ్ ట్రంప్‌ను ట్విట్టర్ లో చూడాలనుకుంటున్నారా అని యూజర్లను అడిగగా చాలా మంది అవును అని ఓటు వేశారు, దీని తర్వాత US మాజీ అధ్యక్షుడి అక్కౌంట్ పై సస్పెన్షన్ తొలగించారు.
అయితే ఎవరి అక్కౌంట్స్ త్వరలో మళ్ళీ ట్విట్టర్‌లోకి తిరిగి వస్తాయి అనేది ట్వీట్ లో స్పష్టం చేయలేదు. ట్విట్టర్‌లో సస్పెండ్ చేసిన కొన్ని ప్రాముఖుల అక్కౌంట్స్ లో కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్, అజీలియా బ్యాంక్స్, సింగర్ అభిజీత్ భట్టాచార్య ఉన్నారు.
పాత ట్విట్టర్ అక్కౌంట్స్ పునరుద్ధరించడానికి ఎలోన్ మస్క్ ఇంట్రెస్ట్ వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబరు చివరిలో ట్విట్టర్ అఫిషియల్ టేకోవర్ తర్వాత, "ఎవరైనా చిన్న అండ్ సందేహాస్పద కారణాలతో ట్వీటర్ నుండి సస్పెండ్ చేయబడితే వారు ట్విట్టర్ జైలు నుండి విడుదల చేయబడతారు" అని ట్వీట్ చేశారు. అతను ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్, కాన్యే వెస్ట్ (యే) అక్కౌంట్స్ పై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అక్కౌంట్ సస్పెన్షన్ పోల్ ముగిసిన వెంటనే ఎత్తివేయబడింది. అలాగే కొద్దిరోజుల్లో కొన్ని నిషేధిత అక్కౌంట్స్ ట్విట్టర్‌లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.
ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు పూర్తయిందని, కంపెనీ త్వరలో తిరిగి నియమకాలు ప్రారంభిస్తుందని తాజాగా ఒక నివేదిక పేర్కొంది. అక్టోబర్ చివరిలో ఎలోన్ మస్క్ ట్విట్టర్ కంపెనీని అధికారికంగా సొంతం చేసుకున్న మొదటి వారంలో ఉద్యోగాల కోత జరిగాయి. గత వారం కొత్త కఠినమైన పని నియమాలకు అనుగుణంగా లేదా సెలవులకు అనుగుణంగా మిగిలిన ఉద్యోగులకు అల్టిమేటం ఇచ్చారు. దీంతో దాదాపు 1,000 మంది ట్విట్టర్ ఉద్యోగుల మూకుమ్మడిగా రాజీనామాకు దారితీసింది. Twitterలో ప్రస్తుతం దాదాపు 2700 మంది ఉద్యోగులు ఉన్నారు, అయితే సెప్టెంబర్‌లో 7500 నుండి తగ్గింది.