ట్విట్టర్‌లో 'గాడ్'ని బ్లాక్ చేసిన ఎలోన్ మస్క్.. నెటిజన్లు ఏమంటున్నారో తెలుసా..?

ది ట్వీట్ ఆఫ్ గాడ్ పేరుతో ట్విట్టర్ పేజీలో ఎలోన్ మస్క్ ప్రొఫైల్ స్క్రీన్ షాట్‌తో కూడిన పోస్ట్‌ను షేర్ చేసింది. ఇందులో ఎలోన్ మస్క్ పేజీని బ్లాక్ చేసినట్లు ఫోటోలో చూపిస్తుంది.  
 

Elon Musk blocks God on Twitter. Heres full story know it-sak

టెస్లా సి‌ఈ‌ఓ ఎలోన్ మస్క్  అసాధారణ ట్వీట్‌లకు ఇంకా విభిన్న విషయాలపై ఆసక్తికరమైన ట్వీట్‌లకు ప్రసిద్ధి. ఈ బిలియనీర్ ఎప్పటికప్పుడు ముఖ్యాంశాలలో నిలుస్తుంటాడు. ఈసారి 'గాడ్' ని బ్లాక్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించగలిగాడు! మీరు గూగ్లింగ్ ప్రారంభించే ముందు, ఇది కేవలం పేరడీ అక్కౌంట్ మాత్రమే అని తెలుసుకోండి.

ది ట్వీట్ ఆఫ్ గాడ్ పేరుతో ట్విట్టర్ పేజీలో ఎలోన్ మస్క్ ప్రొఫైల్ స్క్రీన్ షాట్‌తో కూడిన పోస్ట్‌ను షేర్ చేసింది. ఇందులో ఎలోన్ మస్క్ పేజీని బ్లాక్ చేసినట్లు ఫోటోలో చూపిస్తుంది.  

ఈ పోస్ట్‌కి దాదాపు 5 మిలియన్ల వ్యూస్, లైక్స్, షేర్స్  వచ్చాయి, ఇంకా ఈ పోస్ట్ ని తొలగించలేదు. ఈ విషయంపై నెటిజన్లు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు ఇంకా పోస్ట్‌ను చూడటం ఎంతో ఫన్నీగా ఉంది అంటూ  రిట్వీట్ చేశారు. 

 

గాడ్(నాట్ ఏ పేరడీ, అక్చువల్ గాడ్ ) అని పిలవబడే ట్విట్టర్ అక్కౌంట్  ఈ పోస్ట్‌ను షేర్ చేయడంతో ప్రజలలో విపరీతమైన ప్రజాదరణను పొందింది. అయితే, ఈ అక్కౌంట్ నడుపుతున్న అమెరికన్ వ్రైటర్ డేవిడ్ జావెర్‌బామ్ 2022 నుండి పోస్ట్‌లను షేర్ చేయడం ఆపివేసారు. ఇటీవల, అతను ట్విట్టర్ CEO తనని ఎలా బ్లాక్ చేశారో చూపించడానికి ట్విట్టర్‌లో ట్వీట్ పోస్ట్‌  చేశారు.

ఈ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ త్వరలో లాంగ్-ఫార్మ్ ట్వీట్‌లను 10,000 అక్షరాలకు పెంచుతుందని ఎలోన్ మస్క్ మంగళవారం సూచించాడు. అయితే, ఈ కొత్త ఫీచర్ ఎప్పుడు వస్తుందనే దానిపై ట్విట్టర్ చీఫ్ సమాచారం అందించలేదు.  

యుఎస్‌లోని బ్లూ సబ్‌స్క్రైబర్లు 4,000 అక్షరాల వరకు లాంగ్ ట్వీట్‌లను పోస్ట్ చేయవచ్చని కూడా ట్విట్టర్  పేర్కొంది. కేవలం బ్లూ సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే పొడవైన ట్వీట్‌లను పోస్ట్ చేయగలరు, కాని సబ్‌స్క్రైబర్లు కానివారు వారి ట్వీట్‌ను చదవగలరు, రిట్వీట్ చేయగలరు, కోట్ చేయగలరు. ఇంతకుముందు, ట్వీట్లు కేవలం 280 అక్షరాలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios