Asianet News TeluguAsianet News Telugu

ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా ఎలోన్ మస్క్.. బరాక్ ఒబామాను అధిగమించి టాప్ ప్లేస్ లోకి..

ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా కూడా మారాడు. 51 ఏళ్ల ఎలోన్ మస్క్ ఫాలోవర్ల విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను కూడా అధిగమించారు.
 

Elon Musk becomes the most followed person on Twitter, leaving behind Barack Obama
Author
First Published Apr 1, 2023, 2:35 PM IST

బిలియనీర్, ట్విటర్ కొత్త అధినేత ఎలోన్ మస్క్ ట్విటర్‌లో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా నిలిచారు. 193 బిలియన్ డాలర్లకు పైగా నికర సంపదతో ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా కూడా మారాడు. 51 ఏళ్ల ఎలోన్ మస్క్ ఫాలోవర్ల విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను కూడా వెనక్కి నేట్టారు.

బరాక్ ఒబామా ఫాలోవర్స్ 133 మిలియన్లు. ఎలోన్ మస్క్ గత ఏడాది జూన్‌లో 100 మిలియన్ల ఫాలోవర్స్ మార్క్‌ను దాటారు, అప్పటి నుండి అతని ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది ఇంకా ఫాలోవర్లు కూడా పెరుగుతూనే ఉన్నారు. ఎలోన్ మస్క్ ఫాలోవర్స్  133 మిలియన్ల కంటే పైగా ఉన్నారు.

3 మిలియన్ల ఫాలోవర్లతో సింగర్ జస్టిన్ బీబర్ మూడో స్థానంలో, 108.3 మిలియన్ ఫాలోవర్లతో సింగర్ కేటీ పెర్రీ నాలుగో స్థానంలో, 108.2 మిలియన్ ఫాలోవర్లతో సింగర్ రిహన్న ఐదో స్థానంలో ఉన్నారు. ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో ​​రొనాల్డో 108.1 మిలియన్ల ఫాలోవర్లతో ఆరో స్థానంలో, ట్విటర్‌లో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న లిస్ట్ లో సింగర్ టేలర్ స్విఫ్ట్ 92.5 మిలియన్ల ఫాలోవర్లతో ఏడవ స్థానంలో ఉన్నారు.  

భారత ప్రధాని నరేంద్ర మోడీ. 87.4 మిలియన్ల ఫాలోవర్లతో  ఎనిమిదో స్థానంలో ఉన్నారు. గాయని-నటి లేడీ గాగా 84.7 మిలియన్ల ఫాలోవర్స్ తో తొమ్మిదో స్థానంలో అండ్ హాస్యనటుడు ఎల్లెన్ డిజెనెరెస్ 76.3 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో పదో స్థానాల్లో ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios