Asianet News TeluguAsianet News Telugu

హౌస్ పార్టీల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన లేటెస్ట్ టవర్ స్పీకర్స్.. ఫుల్ బేస్ తో అదిరిపోయే సౌండ్ కూడా..

జూక్ ట్విన్ బారెల్‌తో 2 8-అంగుళాల వూఫర్‌లు ఉన్నాయి, ఇవి అదనపు బాస్ ఇస్తుందని క్లెయిమ్ చేయబడ్డాయి. ఇందులో ఒక్కొక్కటి 4 అంగుళాల 2 స్పీకర్లు ఇంకా 2 అంగుళాల 2 ట్వీటర్‌లు ఉన్నాయి.

Domestic company ZOOOK launches 120W tower speaker two eight-inch woofers for heavy bass
Author
First Published Jan 9, 2023, 5:56 PM IST

కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ ప్రాడెక్ట్స్ కంపెనీ  జూక్ కొత్త పార్టీ స్పీకర్ జూక్ ట్విన్ బ్యారెల్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. జూక్ ట్విన్ బారెల్ టవర్ స్పీకర్ లుకింగ్ పరంగా కూడా చాలా బాగుంటుంది. జూక్ ట్విన్ బారెల్ 120W అవుట్‌పుట్‌తో వస్తున్న డ్యూయల్ టవర్ స్పీకర్. జూక్ ట్విన్ బారెల్ ప్రత్యేకంగా హౌస్ పార్టీల కోసం రూపొందించారు. మీరు ZOOOK ట్విన్ బారెల్‌ను టీవీకి కూడా కనెక్ట్ చేయవచ్చు.

జూక్ ట్విన్ బారెల్‌తో 2 8-అంగుళాల వూఫర్‌లు ఉన్నాయి, ఇవి అదనపు బాస్ ఇస్తుందని క్లెయిమ్ చేయబడ్డాయి. ఇందులో ఒక్కొక్కటి 4 అంగుళాల 2 స్పీకర్లు ఇంకా 2 అంగుళాల 2 ట్వీటర్‌లు ఉన్నాయి. ZOOOK ట్విన్ బ్యారెల్ ధర రూ.12,999గా నిర్ణయించారు.

కనెక్టివిటీ కోసం జూక్ ఈ స్పీకర్ తో బ్లూటూత్ 5.0 ఉంది. అంతేకాకుండా, యూ‌ఎస్‌బి, ఆక్స్ సపోర్ట్ కూడా ఉంది. ఈ స్పీకర్‌లో జి‌ఎం రేడియో కూడా అందించారు. స్పీకర్ ఫ్రీక్వెన్సీ పరిధి 20Hz-20KHz. దినితో పాటు రిమోట్ లభిస్తుంది, దీని ద్వారా మీరు ఈ స్పీకర్‌ని కంట్రోల్ చేయవచ్చు.

స్పీకర్‌తో పాటు ఎల్‌ఈ‌డి లైట్ కూడా అందించారు. ఇంకా వాల్యూమ్ కంట్రోల్ కోసం స్టైలిష్ బటన్‌ ఉంది. కరోకే మైక్‌కి ZOOOK ట్విన్ టవర్ బారెల్‌తో కూడా సపోర్ట్ ఇచ్చారు  ఇంకా మీరు దానితో పాటు వైర్‌లెస్ మైక్‌ను కూడా పొందుతారు. మీరు వైర్‌లెస్‌గా ఇంకా వైర్‌తో మైక్‌ని ఉపయోగించవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios