వాట్సాప్‌లో డేటాను డిలీట్ చేయకుండా కొత్త ఫోన్‌కి బ్యాకప్ చేయడం ఎలాగో తెలుసా?

మీరు కూడా మీ నంబర్‌ మారిస్తే మీ WhatsApp అకౌంట్  అలాగే ఉంచాలనుకుంటే నంబర్‌ను మార్చే  ముందు మీ కాంటాక్ట్స్   తెలియజేయండి.  డేటాను సేవ్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ ద్వారా మీకు సహాయపడే స్టెప్స్  గైడ్ ఇక్కడ ఉంది... 
 

Do you know how to backup WhatsApp to a new phone without deleting the data?-sak

మీ WhatsApp చాట్ ఫోటోస్, వీడియోలను పాత నంబర్ నుండి కొత్త నంబర్‌కు డేటా కోల్పోకుండా ఎలా బ్యాకప్ చేయాలో తెలుసా ?  

మీ ఫోన్ నంబర్‌లను మార్చడం కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. అయితే వాట్సాప్‌లో నంబర్‌ను అప్‌డేట్ చేస్తున్నప్పుడు, ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఫన్నీ మీమ్‌లు, ముఖ్యమైన డాకుమెంట్స్, వాట్సాప్ చాట్‌లను సేవ్ చేయడం ముఖ్యం.

మీరు కూడా మీ నంబర్‌ మారిస్తే మీ WhatsApp అకౌంట్  అలాగే ఉంచాలనుకుంటే నంబర్‌ను మార్చే  ముందు మీ కాంటాక్ట్స్   తెలియజేయండి.  డేటాను సేవ్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ ద్వారా మీకు సహాయపడే స్టెప్స్  గైడ్ ఇక్కడ ఉంది... 

స్టెప్ 1: మీ పాత ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయండి.

స్టెప్ 2: ఇప్పుడు సెట్టింగ్‌లకు వెళ్లండి. Androidలో పైన కుడి మూలన ఉన్న మూడు చుక్కలను నొక్కండి. ఐఫోన్ యూజర్లు  సెట్టింగ్‌లు కింద  కుడి మూలలో గమనించండి... 

స్టెప్ 3: ఛేంజ్ WhatsApp నంబర్ పై క్లిక్  చేయండి.

స్టెప్ 4: స్క్రీన్‌పై ఒక మెసేజ్  చూపిస్తుంది. మీ నంబర్‌ని మార్చడం వలన మీ అకౌంట్ వివరాలు, చాట్ అండ్  సెట్టింగ్‌లు మారుతాయని తెలియజేస్తుంది.

స్టెప్ 5: ఇప్పుడు నెక్స్ట్ నొక్కండి. మీ పాత ఇంకా కొత్త ఫోన్ నంబర్‌లను ఎంటర్  చేయండి.

స్టెప్ 6: మీ కాంటాక్ట్స్ కి నంబర్ ఎలా తెలియజేయాలో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ WhatsApp మూడు అప్షన్స్  అందిస్తుంది:

స్టెప్ 7: ఇప్పుడు మీ సేవ్ కాంటాక్ట్స్  లో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలియజేస్తుంది.

స్టెప్ 8: మీరు చాట్ చేసిన కాంటాక్ట్స్ కి  మాత్రమే తెలియజేయబడుతుంది.

  మీరు మీ ఫోన్ ఇంకా  SIM కార్డ్ రెండింటినీ మార్చినట్లయితే, మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో లోకల్   బ్యాకప్‌ను ఎలా చేయాలో  ఇక్కడ చూడండి.

*వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.

*చాట్‌ని సెలెక్ట్ చేసుకొని   చాట్ బ్యాకప్‌ని క్లిక్  చేయండి.

*మీరు రోజు, వారానికి లేదా నెలకి బ్యాకప్ అప్షన్స్  మధ్య సెలెక్ట్ చేసుకోవచ్చు.

*బ్యాకప్‌లో వీడియోలను చేర్చాలా వద్దా అని చూస్కోండి. (వీడియోలతో సహా బ్యాకప్ సైజ్  పెరుగుతుందని గమనించండి.)

*ప్రాసెస్  ప్రారంభించడానికి "బ్యాకప్" నొక్కండి. మీ చాట్ మీ ఫోన్ స్టోరేజ్‌లో స్టోర్ చేయబడుతుంది.

*కొత్త ఫోన్‌లో WhatsApp బ్యాకప్‌ను సేవ్ చేయండి.

*మీ కొత్త ఫోన్‌లో WhatsAppని డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి.

*సెటప్ ప్రాసెస్ సమయంలో మీ కొత్త ఫోన్ నంబర్‌ను వెరిఫై చేయండి.

*మీరు ముందుగా మీ పాత ఫోన్ నంబర్‌తో మీ WhatsAppని రీప్లేస్ చేయవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios