నెట్‌ఫ్లిక్స్ కనెక్షన్ కట్.. వేలాది మంది యూజర్ల ఆందోళన..
నెట్‌ఫ్లిక్స్ సేవలు నిలిచిపోయాయి. అమెరికాలో మాత్రమే నెట్‌ఫ్లిక్స్ సేవలు నిలిచిపోయినప్పటికీ నెట్‌ఫ్లిక్స్ డౌన్ కావడం వల్ల వేలాది మంది యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓవర్ ది టాప్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ సేవలు నిలిచిపోయాయి. అయితే ఇండియాలో కాదు అమెరికాలో మాత్రమే. నెట్‌ఫ్లిక్స్ సేవలు నిలిచిపోయినప్పటికీ నెట్‌ఫ్లిక్స్ డౌన్ కావడం వల్ల వేలాది మంది వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
ఈ సమాచారం అవుట్‌టేజ్ ట్రాకర్ సైట్ Downdetector.com ద్వారా అందించబడింది. నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ అంతరాయాన్ని ధృవీకరించింది. ఈ సమస్య వినియోగదారులందరూ ఎదుర్కొన్నప్పటికికి ఊహించని టెక్నాలజీ లోపం కారణంగా ఈ సమస్య సంభవించిందని తెలిపింది.
దాదాపు 7,000 మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు భారత కాలమానం ప్రకారం ఉదయం 5:47 గంటలకు డౌన్‌డెటెక్టర్‌లో అంతరాయాన్ని నివేదించారు. తక్కువ సమయంలోనే ఫిర్యాదుల సంఖ్య 17,000 మార్కును దాటింది. నెట్‌ఫ్లిక్స్ అంతరాయంపై భారతీయ వినియోగదారులు ఫిర్యాదు చేయలేదు.