ఈ రోజు 4 గంటల నుండే కోవిడ్ -19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్స్ .. 18 ఏళ్ళు పైబడిన వారు ఎలా నమోదు చేసుకోవాలంటే..?

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నుండి కోవిన్ ప్లాట్‌ఫాం లేదా ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించి 18 ఏళ్ళు పైబడిన భారతీయులందరూ  కోవిడ్-19  వాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 
 

Covid 19 vaccine registration to open for all adults at 4pm today check Here how to register

కోవిడ్ -19 వ్యాక్సిన్ 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి మే 1 నుండి అందించనున్నారు. అయితే  ఇందుకు మీరు ముందుగా  ఆరోగ్య సేతు యాప్ లేదా  కోవిన్ ప్లాట్‌ఫాం ఉపయోగించి 18 ఏళ్లు పైబడిన వారందరూ కూడా కోవిడ్ -19  టీకా కోసం ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.  ప్రస్తుతం 45 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి మాత్రమే టీకాలు అందిస్తున్నారు.

ప్రస్తుతం భారతదేశం అంతాట కోవిడ్ వాక్సినేషన్ నిర్వహిస్తున్నారు, వీటిలో హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్, ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా చేత అభివృద్ధి చేయబడిన కోవిషీల్డ్ ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్నాయి. రష్యాలో అభివృద్ధి చేయబడిన స్పుత్నిక్ వి డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ భారతదేశంలో దిగుమతి చేసుకుని విక్రయిస్తుంది.  దీనిని ఇండియన్ డ్రగ్ రెగ్యులేటరీ కూడా ఆమోదించింది.


కోవిడ్ -19 సెకండ్ వేవ్ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో భారతదేశాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. గత సంవత్సరంతో పోల్చితే  కేసుల పెరుగుదల అత్యధికంగా నమోదవుతున్నాయి. కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేటు  యాప్ ఉపయోగించి కరోనా టీకా కోసం వినియోగదారులు ఎలా నమోదు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి..

 కోవిన్ పోర్టల్ ద్వారా ఎలా నమోదు చేసుకోవాలి 
1. కోవిన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి తరువాత రిజిస్టర్ / సైన్ ఇన్ పై  క్లిక్ చేయండి.
2. మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి గెట్ ఓ‌టి‌పి పై క్లిక్ చేయండి. ఓ‌టి‌పి పొందిన తర్వాత సైట్‌లో మీ నంబరుకు వచ్చిన  అంకెలను టైప్ చేసి, ‘వెరిఫై’ పై క్లిక్ చేయండి.
3. ఫోటో ఐడి ప్రూఫ్, పేరు, లింగం, పుట్టిన సంవత్సరంతో  సహా మీ పూర్తి వివరాలను ‘రిజిస్టర్ ఫర్ వాక్సినేషన్’ పేజీలో ఎంటర్ చేయండి. ఇది పూర్తయిన తర్వాత రిజిస్టర్ పై నొక్కండి.
4. మీరు రిజిస్టర్ చేసిన తరువాత అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసే ఆప్షన్ మీకు లభిస్తుంది. రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి పేరు ప్రక్కన ఉన్న ‘షెడ్యూల్’ పై క్లిక్ చేయండి.
5. మీ పిన్ కోడ్‌ను ఎంటర్ చేసి  సెర్చ్ పై క్లిక్ చేయండి. తరువాత పిన్ కోడ్‌లోని వాక్సిన్  కేంద్రాలు కనిపిస్తాయి.
6. తేదీ  అలాగే సమయం ఎంచుకుని ‘కన్ఫర్మ్’ పై క్లిక్ చేయండి.

గమనిక : వినియోగదారులు ఒక లాగిన్ ద్వారా నలుగురుని వాక్సిన్ కోసం చేర్చవచ్చు అలాగే అపాయింట్‌మెంట్‌ను సులభంగా షెడ్యూల్ చేయవచ్చు.  

ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే 

1. మీ మొబైల్ లో ఆరోగ్య సేతు యాప్ ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్‌లో ఉన్న కోవిన్ టాబ్‌పై క్లిక్ చేయండి.
2. తరువాత ‘వాక్సినేషన్ రిజిస్ట్రేషన్’ ఆప్షన్ ఎంచుకుని ఆపై మీ ఫోన్ నంబర్‌ను  రిజిస్టర్ చేయండి. దీని తరువాత మీ మొబైల్ నంబరుకు  ఓ‌టి‌పి వస్తుంది.   
 ఓ‌టి‌పి ఎంటర్ చేసి వేరిఫై చేయండి
3. ‘వాక్సినేషన్ రిజిస్ట్రేషన్’ పేజీలో ఫోటో ఐడి ప్రూఫ్, పేరు, లింగం, పుట్టిన సంవత్సరంతో సహా పూర్తి వివరాలను ఎంటర్ చేయండి. తరువాత‘రిజిస్టర్’ పై క్లిక్ చేయండి.
4. మీరు రిజిస్టర్ చేసిన తరువాత అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసే ఆప్షన్ మీకు చూపిస్తుంది. రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి పేరు పక్కన ఉన్న షెడ్యూల్ పై క్లిక్ చేయండి.
5. ఇక్కడ మీ పిన్ కోడ్‌ ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి. తరువాత పిన్ కోడ్‌లోని వాక్సిన్ కేంద్రాలు కనిపిస్తాయి.
6. తేదీ, సమయం ఎంచుకుని, ‘కన్ఫర్మ్’ పై క్లిక్ చేయండి.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios