Asianet News TeluguAsianet News Telugu

హబ్ ద్వారా ఫేక్‌ వార్తల కట్టడి.. వాట్సాప్‌ నిర్ణయం

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ కరోనాపై పోరుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా కరోనా ‘వైరస్‌ ఇన్‌ఫర్మేషన్‌ హబ్‌’ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం పోయెంటర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అంతర్జాతీయ ఫ్యాక్ట్‌ చెకింగ్‌ నెట్‌వర్క్‌ కోసం ఒఖ మిలియన్‌ డాలర్ల విరాళం ప్రకటించింది. 

Coronavirus: WhatsApp's million dollar 'plan' to fight fake news
Author
New Delhi, First Published Mar 19, 2020, 5:03 PM IST


న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ కరోనాపై పోరుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా కరోనా ‘వైరస్‌ ఇన్‌ఫర్మేషన్‌ హబ్‌’ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం పోయెంటర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అంతర్జాతీయ ఫ్యాక్ట్‌ చెకింగ్‌ నెట్‌వర్క్‌ కోసం ఒఖ మిలియన్‌ డాలర్ల విరాళం ప్రకటించింది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆధ్వర్యంలో వాట్సాప్‌ ఈ హబ్‌కు శ్రీకారం చుట్టింది. ఈ హబ్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సిబ్బందికి, కమ్యూనిటీ లీడర్లకు, ప్రభుత్వాలకు, వ్యాపార సంస్థలకు కమ్యూనికేషన్‌కు సహకరించడంతో పాటు పలు సూచనలు ఇవ్వనుంది. 

అంతేకాకుండా కరోనా వైరస్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా తప్పుడు వార్తలు ప్రచారం కాకుండా నివారించేందుకు తోడ్పడుతుంది. ఈ ఫేక్‌ వార్తల కట్టడి కోసం ఐఎఫ్‌సీఎన్‌ సహాయం తీసుకుంటోంది.

వాట్సాప్‌ ఉన్నతాధికారి విల్‌ క్యాత్‌కార్ట్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ప్రస్తుత కరోనా సంక్షోభం వల్ల వాట్సాప్‌ వాడకం చాలా పెరిగింది. అందరూ తమ స్నేహితులకు, బంధువులకు సమాచారాన్ని చేరవేసుకుంటున్నారు. కాబట్టి ఐఎఫ్‌సీఎన్‌ సాయంతో ఫేక్‌ వార్తల నివారణకు,  వినియోగ దారులకు సహకరించేలా నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపారు.  
‘అదేవిధంగా ఎప్పటికప్పుడు కరోనా అప్‌డేట్స్‌ అందించడానికి అన్ని దేశాల ఆరోగ్య మంత్రులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాం’ అని విల్‌ క్యాత్‌కార్ట్‌ తెలిపారు. వాట్సాప్‌ను భారత్‌లో 40 కోట్ల మంది వినియోగిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios