Asianet News TeluguAsianet News Telugu

బి‌ఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్... కేవలం రూ. 299 ఆన్ లిమిటెడ్ బ్రౌజింగ్...

ఈ ప్లాన్లలో భాగంగా రూ. 299, రూ. 399,  రూ. 555 ఉన్నాయి. ఈ ప్లాన్ లన్ని  10ఎం‌బి‌పి‌ఎస్  ప్రారంభ స్పీడ్ తో వస్తాయి.   ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ 1 మార్చి 2021  నుంచి అందుబాటులోకి వస్తాయి. 

BSNL Introduces Rs.299, Rs.399, Rs.555 Broadband Plans With 10Mbps Speeds check more details here
Author
Hyderabad, First Published Feb 28, 2021, 4:54 PM IST

దేశీయ టెలికాం భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) మూడు కొత్త డిఎస్ఎల్ బ్రాడ్ బ్యాండ్  ప్లాన్లను ప్రవేశపెట్టింది.  ఈ ప్లాన్లలో భాగంగా రూ. 299, రూ. 399,  రూ. 555 ఉన్నాయి.

ఈ ప్లాన్ లన్ని  10ఎం‌బి‌పి‌ఎస్  ప్రారంభ స్పీడ్ తో వస్తాయి.   ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ 1 మార్చి 2021  నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇంతకన్నా ఎక్కువ ధరకు కూడా బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ఉన్నాయి.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.299 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 100జీబీ డేటా, 10 ఎంబీపీఎస్ హై-స్పీడ్‌తో అందిస్తున్నారు. డేటా పూర్తీ అయ్యాక ఇంటర్నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్ ఆరు నెలలు అందుబాటులో ఉంటుంది.

also read మొబైల్ ఫోటోగ్రఫీ కోసం ఈ ప్రత్యేక పద్ధతులను పాటించండి.. దీంతో మీ ఫోటోలు చాలా ప్రొఫెషనల్ గా కూడా కనిపి...

ఆ తర్వాత రూ.399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది. బిఎస్‌ఎన్‌ఎల్ రూ.399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటే 10 ఎంబీపీఎస్ హై-స్పీడ్‌తో 200జీబీ డేటా వస్తుంది. డేటా పరిమితి అయిపోయిన తర్వాత స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది.

రూ.555 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటే 10 ఎంబిపిఎస్ స్పీడ్ తో 500జీబీ డేటా వస్తుంది. డేటా పూర్తైన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. కొత్త వినియోగదారులు బిఎస్‌ఎన్‌ఎల్ రూ.299, రూ.399 ప్లాన్‌లు తీసుకోవాలంటే ముందుగా రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. 

ఈ మూడు ప్లాన్‌లు ఆన్ లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలతో వస్తాయి. రూ.299, రూ. 399, రూ. 555 డిఎస్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కొత్త అలాగే ఇప్పటికే ఉన్న కస్టమర్లు పొందవచ్చు. వీటికి అదనంగా బిఎస్ఎన్ఎల్ 5.5 నెలలు, 10.5 నెలలు, 20.5 నెలలు, 30.5 నెలలు  వంటి  కొన్ని ఇతర ప్లాన్ లను కూడా అందిస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios