ఇదే మంచి ఛాన్స్! ఫేస్‌మాస్క్ బిజినెస్‌లో ఈ రిటైలర్లు !!

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయంతో యావత్ ప్రపంచ మానవాళి విలవిలలాడుతున్నది. కరోనా నుంచి రక్షించుకునేందుకు వినియోగించే ఫేస్ మాస్క్‌లు ఇప్పుడు హాట్ కేక్‌లు.. ప్రస్తుతం వీటికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏవ్యాపారానికైనా అవసరమే తల్లిలాంటిది.

Big brands unmask a hot new sales category

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయంతో యావత్ ప్రపంచ మానవాళి విలవిలలాడుతున్నది. కరోనా నుంచి రక్షించుకునేందుకు వినియోగించే ఫేస్ మాస్క్‌లు ఇప్పుడు హాట్ కేక్‌లు.. ప్రస్తుతం వీటికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏవ్యాపారానికైనా అవసరమే తల్లిలాంటిది. డిమాండ్‌ను, ప్రజల అవసరాలను సద్వినియోగం చేసుకోవడం వ్యాపారులు, వ్యాపార సంస్థల పని.

ఫేస్‌మాస్కు‌‌లు ప్రస్తుత సమాజంలో సరికొత్త కొత్తఫ్యాషన్. తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌లో ప్రజలు మాస్కులను ధరించడం తప్పనిసరి చేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. 

ఫేస్ మాస్కు‌‌లు. రిటైల్ నుంచి పెద్ద ఫ్యాషన్, లైఫ్‌ స్టయిల్ కంపెనీల వరకు ఇప్పుడు దృష్టంతా ఫేస్‌ మాస్కులను తయారు చేయడంపైనే పడింది. ఈ కంపెనీలు ప్రస్తుతం ఫేస్ మాస్కు‌‌లు అమ్మడం ప్రారంభించాయి. 

ఫేస్ మాస్కు‌‌లు అమ్మే కంపెనీల్లో ఇప్పుడు పెద్ద పెద్ద ఈ– కామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్‌‌‌కార్ట్, మిత్రా, బిగ్‌‌బాస్కెట్, రిలయన్స్ రిటైల్, గ్రోఫర్స్‌‌ వచ్చి చేరాయి. ప్రపంచ మానవాళి అంతా ఫేస్ మాస్కులు ధరించడం తప్పనిసరి. 

ప్రజలు వాడటం తప్పనిసరి కావడంతో ఫేస్ మాస్క్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగి కొరత ఏర్పడింది. మాస్కుల ప్రొడక్షన్ పెంచడమని అప్పరెల్ బ్రాండ్లను, సప్లయిర్లను అమెజాన్, ఫ్లిప్‌‌ కార్ట్‌లు‌ ఆదేశిస్తున్నాయి. అప్పరెల్ కంపెనీలకు కూడా మాస్కులను తయారు చేయడం కోసం భారీ ఆర్డర్లు వస్తున్నాయి.

ఇప్పుడు ఈ కంపెనీల కోర్ ప్రొడక్టులు‌ కూడా మాస్కు‌‌లుగానే మారాయని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. సెల్లర్స్ ద్వారా ప్రైవే బ్రాండ్ల మాస్కు‌‌లను అమ్మడం అమెజాన్, ఫ్లిప్‌‌ కార్ట్‌‌‌లు  ప్రారంభించాయి. లాక్‌‌డౌన్ వల్ల ఫ్లిప్‌‌‌కార్ట్‌‌‌కు ‌ చెందిన మింత్రా తన సర్వీసులను రద్దు చేసింది. 

కానీ ఈ వారం నుంచి మాస్కులను మింత్రా డెలివరీ చేయడం ప్రారంభించింది. మరిన్ని ఫేస్ మాస్కుల సప్లయి కోసం టాప్ బ్రాండ్లతో చర్చిస్తున్నట్టు మింత్రా సీఈవో అమర్ చెప్పారు. గ్రోఫర్స్ కూడా మాస్కులను విక్రయిస్తోంది. 

రిలయన్స్ రిటైల్ కూడా మాస్కులను అమ్మేందుకు చూస్తోంది. బిగ్‌‌బాస్కెట్ కూడా తన ప్లాట్‌‌ఫామ్‌‌పై డిస్పోజబుల్ యాంటీ పొల్యుషన్ మాస్కులను ప్రవేశపెడుతోంది. 

పలు అప్పరెల్‌‌ ఎక్స్ పోర్ట్ సంస్థలు కూడా లాక్‌ ‌డౌన్ వల్ల తమ యూనిట్లను మూసివేసుకున్నాయి. కానీ ప్రస్తుతం వాటిని తెరుస్తున్నాయి. గత వారం నుంచి మాస్కుల మానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తిరుపూర్‌ మారింది.

also read:కరోనా కట్టడే ధ్యేయం పీఎం-కేర్స్‌ కోసం పేటీఎం రూ.100 కోట్ల సేకరణ

కరోనా వ్యాధి వల్ల గత నెల నుంచి ఇండియాలో మాస్కు‌‌లు, హ్యాండ్ శానిటైజర్లు, టాయిలెట్ క్లీనర్ వంటి హైజీన్ ప్రొడక్ట్‌ల‌ విక్రయాలు బాగా పెరిగినట్టు మార్కెట్ రీసెర్చర్ నీల్సన్ నివేదించింది. 

భవిష్యత్‌లో 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకు మాస్కులను అమ్ముడుపోయే అవకాశం ఉందని డెనిమ్ కన్సల్టెంట్ సందీప్ అగర్వాల్ తెలిపారు. సర్జికల్ మాస్కులకు కూడా డిమాండ్ బాగా ఉందని డెనిమ్ కన్సల్టెంట్ సందీప్ అగర్వాల్ పేర్కొన్నారు. టెక్స్‌టైల్ ఇండస్ట్రీకి ఈ ఏడాది నుంచి వస్తున్న నష్టాలను ఫేస్ మాస్కులు కాస్త తగ్గించనున్నాయని డెనిమ్ అగర్వాల్ అన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios