Asianet News TeluguAsianet News Telugu

యూట్యూబ్ చూసేవారికి బ్యాడ్ న్యూస్....ఏంటంటే...

యూట్యూబ్ ని మీరు రోజు ఏక్కువగా  చూస్తుంటారా? యూట్యూబ్ లో   మీరు చేసిన వీడియోస్, కుకింగ్ వీడియోస్, ఫున్ని వీడియోస్ చేస్తుంటార అయితే మీకోసమే ఈ న్యూస్. యూట్యూబ్ ఇప్పుడు కొన్ని కొత్త నిబంధనలు పెట్టబోతుంది. ఇది మీకు కచ్చితంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే దీని ప్రభావం యూట్యూబ్ వినియోగదారులందరి మీదా పడే ప్రభావం ఉంది.

bad news for youtube channel users
Author
Hyderabad, First Published Nov 12, 2019, 3:51 PM IST

ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం అయిన యూట్యూబ్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వినియోగదారులకు, యూట్యూబ్ లో వీడియోలు పెట్టేవారికి నచ్చకపోవచ్చు ఎందుకంటే 2019 డిసెంబర్ 10వ తేదీ నుంచి తమకు ఎక్కువగా ఆదాయం అందించని యూట్యూబ్ చానెళ్లను తొలగించాలని యూట్యూబ్ నిర్ణయం తిసుకుంది. ఇక మీరు యూట్యూబ్ లో పెట్టే వీడియోలకు యాడ్ రెవిన్యూ రాకపోతే మీ చానెళ్లు ఇక యూట్యూబ్ లో కనిపించదు అన్నమాట.

యూట్యూబ్ దీనికి సంబంధించిన నిబంధనలను కూడా వివరించింది. మీరు అందించే సేవలు యూట్యూబ్ కి భారంగా మారితే మీ ఖాతాకు సంబంధించిన అనుమతులు అన్నీ తొలగించే అవకాశం ఉందని పేర్కొంది.

aslo read లక్ష్యం దిశగా బీఎస్ఎన్ఎల్.. వీఆర్ఎస్ @ 75 వేలు

అయితే కేవలం యూట్యూబ్ కి సంబంధించి మాత్రమే కాకుండా గూగుల్ కి సంబంధించిన డేటాను కూడా తొలగిస్తామని తెలిపింది. అంటే జీమెయిల్, డాక్స్, గూగుల్ ఫొటోస్ వంటి సర్వీసులు కూడా ఆయా ఖాతాలకు లభించవు.

అయితే ఈ నియమ నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి అని నిర్దిష్టంగా తెలియకపోయినా.. యూట్యూబ్ పేర్కొన్న నియమ నిబంధనలను బట్టి చూసినట్లయితే ఇవి యూట్యూబర్లకే అని తెలుసుకోవచ్చు. దీన్ని కేవలం యూట్యూబర్లకే కాకపోయినా సాధారణ వినియోగదారులకు కూడా బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

bad news for youtube channel users

ఎందుకంటే కొంతమంది ఆదాయం ఆశించకుండా తమకు సంబంధించిన కంటెంట్ పది మందికీ చేరాలనే ఉద్దేశంతో వీడియోలు యూట్యూబ్ లో పెడుతూ ఉంటారు దీంతో ఇప్పుడు యూట్యూబర్లందరికీ ధనార్జనే తమ ప్రధాన లక్ష్యంగా చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

aslo read ఫుజిఫిల్మ్ నుంచి మిర్రర్‌లెస్ కెమెరా లాంచ్...దీని ధర....
    
దీనిపై యూట్యూబ్ అధికార ప్రతినిధులు స్పందిస్తూ.. తమ సేవల నిబంధనల్లో పలు మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. తమ నిబంధనలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉంటామని, ఇది అందులోనే భాగమని తెలిపారు. తమ ఉత్పత్తుల్లో మార్పులు ఉండవన్నారు.

అయితే దీనిపై వినియోగదారుల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిబంధనలు కొత్తగా కంటెంట్ అందించేవారిని నిరాశకు గురి అవుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి యూట్యూబ్ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటుందో వినియోగదారుల నుంచి వచ్చే ఒత్తిళ్లకు తలొగ్గి కాస్త వెనక్కి తగ్గుతుందో లేదో చూడాలి!

Follow Us:
Download App:
  • android
  • ios