ఆసుస్ జెన్‌బుక్ 17 ఫోల్డ్ OLED కోసం ప్రీ-ఆర్డర్‌లు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి, ఇది నవంబర్ 9 వరకు కొనసాగుతుంది.  ఆసుస్ జెన్  బుక్ 17 ఫోల్డ్ ఓ‌ఎల్‌ఈ‌డి 17.3-అంగుళాల ఫోల్డబుల్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే మొదటి ల్యాప్‌టాప్ అవుతుంది. 

కంప్యూటర్ హార్డ్ వేర్ కంపెనీ ఆసుస్ మొదటి ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ను ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఆసుస్ జెన్ బుక్ 17 ఫోల్డ్ ఓ‌ఎల్‌ఈ‌డి నవంబర్ 10న ఇండియాలో లాంచ్ కానుంది. ప్రస్తుతం మార్కెట్లోకి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే వస్తున్నాయి, అయితే ఆసుస్ ఈ చైన్‌ను బ్రేక్ చేసి ఆసుస్ జెన్ బుక్ 17 ఫోల్డ్ ఓ‌ఎల్‌ఈ‌డిని లాంచ్ చేయబోతోంది. దీనిని ఈ ఏడాది జనవరిలో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2022లో మొదటిసారి ప్రదర్శించారు.

ఆసుస్ జెన్‌బుక్ 17 ఫోల్డ్ OLED కోసం ప్రీ-ఆర్డర్‌లు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి, అలాగే నవంబర్ 9 వరకు కొనసాగుతుంది. ఆసుస్ జెన్ బుక్ 17 ఫోల్డ్ ఓ‌ఎల్‌ఈ‌డి 17.3-అంగుళాల ఫోల్డబుల్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే మొదటి ల్యాప్‌టాప్ అవుతుంది. ఇండియాలో ప్రీ-బుకింగ్ రూ. 3,29,990 ప్రారంభ ధరతో ఉంటుంది, అయితే, ప్రీ-ఆర్డర్ చేసిన యూజర్లు 2,84,290 ధరతో ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రీ-ఆర్డర్ చేసిన కస్టమర్లకు రూ.32,100 గిఫ్ట్ లభిస్తుంది. అంతేకాకుండా, ఈ ల్యాప్‌టాప్‌తో మూడేళ్ల వారంటీతో ఒక సంవత్సరం ఆక్సీడెంటల్ డ్యామేజ్ లభిస్తుంది.

స్పెసిఫికేషన్‌లు
ఈ ల్యాప్ టాప్ ఫీచర్ల గురించి మాట్లాడితే Asus ZenBook 17 OLED 4:3 అంగుళాల డిస్‌ప్లే, ప్రైమరీ స్క్రీన్ 17.3 అంగుళాలు, స్క్రీన్ రిజల్యూషన్ 2.5K, ల్యాప్‌టాప్‌ను మధ్యలో నుండి ఫోల్డ్ చేయవచ్చు ఇంకా రెండు భాగాలను కూడా వేరు చేయవచ్చు. వేరు చేసిన తర్వాత స్క్రీన్ సైజ్ 12.5 అంగుళాలు ఉంటుంది. దీని కీలు 180 డిగ్రీలు. Asus ZenBook 17 Fold OLED డిస్ప్లే Pantone టెక్నాలజీతో వస్తుంది అంటే మీరు మంచి కలర్ అనుభవాన్ని పొందుతారు. ఇంకా డాల్బీ విజన్ అండ్ TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌తో కూడా వస్తుంది.

Asus ZenBook 17 Fold OLED గ్రాఫిక్స్ కోసం Iris Xeతో 12వ Gen Intel కోర్ i7 ప్రాసెసర్, 16GB LPDDR5 RAM, 1TB PCIe Gen4 SSD స్టోరేజ్‌ పొందుతుంది. ఇందులో రెండు USB Type-C Thunderbolt 4.0 పోర్ట్‌లు ఉంటాయి. అంతేకాకుండా 75Whr బ్యాటరీ, ఇన్‌ఫ్రారెడ్ కెమెరా డిటెక్షన్‌ను కూడా ఉంది ఇంకా 5-మెగాపిక్సెల్ వెబ్‌క్యామ్ కూడా ఇచ్చారు.