Apple Payments Process: ఇండియాలో యాపిల్ పేమెంట్లకు బ్రేక్..!
ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రభావం యాపిల్ సంస్థపై పడింది. ఇండియాలో యాపిల్ సంస్థ కార్డు చెల్లింపులకు బ్రేక్ పడింది. మరి యాపిల్ పేమెంట్లు చేయాలంటే ఏం చేయాలి..ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
![Apple stops debit, credit card payments in India Apple stops debit, credit card payments in India](https://static-gi.asianetnews.com/images/01frwxrps63a7243msp59xwbp4/yjtr-jpg_363x203xt.jpg)
ఆటో డెబిట్ పేమెంట్లకు సంబంధించి 2021లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఆటోమెటిక్ పేమెంట్ ప్రాసెస్ చేయాలంటే 24 గంటల ముందు బ్యాంకులు ప్రీ డెబిట్ నోటిఫికేషన్ పంపించాల్సి ఉంటుంది. ప్రతి నెలా ప్రతి లావాదేవీకు ఇది అవసరం. 5 వేల రూపాయల కంటే ఎక్కువ చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. అదనంగా ఓటీపీ ద్వారా బ్యాంకులు సంబంధిత కస్టమర్‌తో ధృవీకరించుకోవాలి. ఈ ప్రభావం ఇప్పుడు యాపిల్ సంస్థ ఐడీ పేమెంట్లపై పడింది.
యాప్ స్టోర్‌లో సబ్‌స్క్రిప్షన్, యాప్ పేమెంట్ కోసం కార్డు చెల్లింపుల్ని యాపిల్ సంస్థ నిలిపివేసింది. ఇక నుంచి యాప్ స్టోర్ సర్వీసులు లేదా కొనుగోళ్ల కోసం ఇండియాలోని యూజర్లు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉపయోగించలేదు. ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం ఆటోడెబిట్ విధానం ఇకపై కొనసాగదు కూడా. ఒకవేళ ప్రయత్నించినా ఎర్రర్ మెస్సేజ్ వస్తుంది.
యాపిల్ పేమెంట్లు ఎలా చేయాలి..?
ఇప్పుడు ఇండిాయలో యాపిల్ యూజర్లు పేమెంట్లు చేయాలంటే ముందుగా యాపిల్ ఐడీ ఎక్కౌంట్లో బ్యాలెన్స్ యాడ్ చేయాలి. ఆ తరువాత నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు.
యాపిల్ ఐడీకు బ్యాలెన్స్ ఎలా జమ చేయాలి..!
ఇది చాలా సులభమే. ముందుగా మీ ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌లో యాపిల్ స్టోర్ ఓపెన్ చేయాలి. ఆ తరువాత కుడి చేతివైపున ఎగువ భాగంలో ఉన్న ప్రొఫైల్ పిక్ క్లిక్ చేయండి. ఇప్పుడు యాడ్ మనీ ఆప్షన్ నొక్కాలి. ఆ తరువాత మీ పేమెంట్ వివరాలు ధృవీకరించేందుకు స్క్రీన్‌పై కన్పించే సూచనలు ఫాలో కావాలి. యాప్ కొనుగోలు లేదా సబ్‌స్క్రిప్షన్ రెన్యువల్ గుడవుపై ఆటోమెటిక్ ఆప్షన్ తొలగించాలి. ఎప్పుడు బ్యాలెన్స్ ఖాళీ అయితే..అప్పుడు ఎక్కౌంట్లో కావల్సిన నగదు మొత్తాన్ని జమ చేసుకుంటుూ ఉండాలి.
![left arrow](https://static-gi.asianetnews.com/v1/images/left-arrow.png)
![right arrow](https://static-gi.asianetnews.com/v1/images/right-arrow.png)