ఆపిల్ కంపెనీ ఆపిల్ స్టోర్ దీపావళి ఆఫర్‌లో క్రెడిట్ కార్డ్‌లపై 7 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అండ్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్‌లతో మాత్రమే పేమెంట్ చేసే కస్టమర్‌లు ఇన్స్టంట్ డిస్కౌంట్ బెనెఫిట్స్ పొందుతారు. 

ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ అండ్ ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్  మధ్య  ఆపిల్ పెద్ద బహుమతిని ఇచ్చింది. ఆపిల్ ఇప్పుడు కస్టమర్ల కోసం దీపావళి ఆఫర్ ఆపిల్ స్టోర్ దీపావళి ఆఫర్ సేల్‌ తీసుకొచ్చింది. ఆపిల్ ఈ సేల్ సెప్టెంబర్ 26 నుండి అంటే ఈరోజు నుండి ప్రారంభమైంది. ఈ సేల్‌లో HDFC బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 7,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తుంది. ఆఫర్‌ కింద రూ. 41,900 కంటే ఎక్కువ విలువైన ఉత్పత్తులపై మాత్రమే ఈ బెనిఫిట్ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ సెలెక్టెడ్ Apple కస్టమర్లకు మాత్రమే. 

ఆపిల్ కంపెనీ ఆపిల్ స్టోర్ దీపావళి ఆఫర్‌లో క్రెడిట్ కార్డ్‌లపై 7 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అండ్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్‌లతో మాత్రమే పేమెంట్ చేసే కస్టమర్‌లు ఇన్స్టంట్ డిస్కౌంట్ బెనెఫిట్స్ పొందుతారు. అలాగే ఆఫర్‌ బెనెఫిట్స్ పొందడానికి కస్టమర్‌లు కనీసం రూ.41,900కి ఒకేసారి రెండు ప్రాడక్ట్స్ కొనుగోలు చేయవచ్చు.  

Apple iPhoneలు, MacBooks, iPadలు అండ్ AirPod కొనుగోలుపై ఈ ఆఫర్‌ను పొందవచ్చు. Apple కొత్త iPhone 14ని ఈ ఆఫర్ కింద రూ. 72,900కి కొనుగోలు చేయవచ్చు, దీని ఎం‌ఆర్‌పి ధర రూ. 79,900. Apple స్టోర్ దీపావళి ఆఫర్‌లో అన్ని iPhoneలపై 7 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్ (గరిష్టంగా రూ. 7000) ఉంటుంది. ఇది మాత్రమే కాదు కస్టమర్‌లు 3 నుండి 6 నెలల నో-కాస్ట్ EMI ఇంకా ఆఫర్‌ క్రింద పాత ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ చేసుకునే సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. 

ఆపిల్ కొత్త ప్రాడక్ట్స్ లాంచ్ 
ఈ నెల సెప్టెంబర్ 7న ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్, ఆపిల్ వాచ్ 8, ఎయిర్‌పాడ్స్ ప్రో 2లను లాంచ్ చేసింది. ఇండియాలో iPhone 14 ప్రారంభ ధర రూ.79,900. ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900, ఐఫోన్ 14 ప్రో ప్రారంభ ధర రూ. 1,29,900, ఐఫోన్ 14 ప్రో మాక్స్ ప్రారంభ ధర రూ. 1,39,900. Apple వాచ్ సిరీస్ 8 ప్రారంభ ధర రూ. 45,900, Apple Watch SE ప్రారంభ ధర రూ. 29,900 కాగా, Apple Watch Ultra ప్రారంభ ధర రూ. 89,900.