Asianet News TeluguAsianet News Telugu

ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం.. ట్విటర్‌లో మెసేజింగ్ కోసం డబ్బులు చెల్లించాల్సిందే..?

ప్రముఖ యాప్ పరిశోధకురాలు జేన్ మంచున్ వాంగ్ ట్విట్టర్‌లో మెసేజ్ పంపినందుకు డబ్బు కూడా చెల్లించాల్సి ఉంటుందని పోస్ట్ చేశారు. అయితే ఎలోన్ మస్క్ లేదా ట్విట్టర్ నుండి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు.

Another decision of Elon Musk, money will have to be paid for messaging on Twitter!
Author
First Published Nov 3, 2022, 4:20 PM IST

ఎలోన్ మస్క్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను $44 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి మీకు తెలిసిందే. ఎలోన్ మస్క్ ట్విట్టర్ కొత్త అధినేత అయినప్పటి నుండి మొత్తం చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్  వేరిఫైడ్ అక్కౌంట్ బ్లూ టిక్ కోసం చార్జ్ చెల్లింపులతో కొందరు ఇబ్బంది పడుతుండగా, బ్లూ టిక్ రాకపోవడంతో మరికొందరు ఇబ్బంది పడుతున్నారు.

అలాగే వారానికి 12 గంటలు సెలవు లేకుండా పని చేయాలని ఆదేశించినట్లు ఎలోన్ మస్క్ గురించి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యే ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ లో భాగమవుతుందా లేదా అనే విషయంపై సమాచారం లేనప్పటికీ నేరుగా ట్విట్టర్ లో మెసేజ్ చేసేందుకు కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ఓ వార్త వస్తోంది.

ప్రముఖ యాప్ పరిశోధకురాలు జేన్ మంచున్ వాంగ్ ట్విట్టర్‌లో మెసేజ్  పంపినందుకు డబ్బు కూడా చెల్లించాల్సి ఉంటుందని, అయితే ఎలోన్ మస్క్ లేదా ట్విట్టర్ నుండి దీనిపై ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు.

50% తొలగింపు
సి‌ఈ‌ఓ పరాగ్ అగర్వాల్‌తో సహా పెద్ద అధికారులందరినీ తొలగించిన తర్వాత ఇప్పుడు ఎలోన్ మస్క్ వర్క్‌ఫోర్స్‌ను కూడా తగ్గించవచ్చని కొన్ని వార్తా పత్రికలు నివేదిస్తున్నాయి. ఈ నివేదికలు నిజమైతే ఎలోన్ మస్క్ 3700 మంది ఉద్యోగులను ట్విట్టర్ నుండి తొలగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ట్విట్టర్‌లో దాదాపు 7500 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.

ట్విట్టర్ బెస్ట్ ఫ్లాట్ ఫార్మ్
ఇంటర్నెట్‌లో ట్విట్టర్ అత్యంత ఆసక్తికరమైన ప్రదేశం అని ఎలోన్ మస్క్ బుధవారం ఒక ట్వీట్‌లో తెలిపారు, అందుకే మీరు ప్రస్తుతం ఈ ట్వీట్‌ను చదువుతున్నారని,  లెఫ్ట్‌ అండ్  రైట్‌ నుంచి విమర్శలు వస్తున్నా అది శుభసూచకమని అంతకుముందు కూడా ట్వీట్‌ చేశాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios