ఇండియన్ మార్కెట్లోకి అంకర్ ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ స్టాండ్.. కేవలం 30 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్..
అంకెర్ సంస్థ ఈ ఛార్జర్‌కు పవర్‌వేవ్ అని పేరు పెట్టారు. ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ స్టాండ్ సామర్థ్యం 10 వాట్స్.
అమెరికన్ బ్రాండ్ అంకర్ కొత్త వైర్‌లెస్ ఛార్జింగ్ స్టాండ్‌ను విడుదల చేసింది, దీని ద్వారా వైర్‌లెస్ ఛార్జింగ్ మార్కెట్లో తన పట్టును మరింత బలపరిచింది. అంకెర్ సంస్థ ఈ ఛార్జర్‌కు పవర్‌వేవ్ అని పేరు పెట్టారు. ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ స్టాండ్ సామర్థ్యం 10 వాట్స్.
అంకెర్ పవర్‌వేవ్ క్యూఐ సర్టిఫైడ్ ఛార్జర్. మీరు దీని ద్వారా ఏదైనా వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే డివైజ్ ఛార్జ్ చేయవచ్చు. దీని ధర రూ .1,999. ఆఫ్‌లైన్ స్టోర్లతో పాటు అమెజాన్ ఇండియా నుండి దీనిని కొనుగోలు చేయవచ్చు.
కొత్త వైర్‌లెస్ ఛార్జింగ్ స్టాండ్ లాంచి గురించి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు చాలా మంది వీడియోకి కాన్ఫరెన్సులు ఉంటుంటాయి. ఇటువంటి పరిస్థితిలో వైర్‌లెస్ ఛార్జింగ్ స్టాండ్ వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది. అంకెర్ పవర్వేవ్ కేవలం 5 ఎంఎంతో సన్నగా ఉంటుంది. దీనిని ఇంట్లో ఎక్కడైనా పెట్టడంలో సమస్య ఉండదు.
అంకెర్ పవర్‌వేవ్ శామ్‌సంగ్ కొత్త డివైజ్ (గెలాక్సీ ఎస్ 21 సిరీస్) కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ 10W ఛార్జర్‌తో కేవలం 30 నిమిషాల్లో శామ్‌సంగ్ ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని పేర్కొన్నారు. భద్రతకు సంబంధించి, ఫుల్ ఛార్జ్ తర్వాత కూడా ఈ ఛార్జింగ్ స్టాండ్ ఫోన్‌కు హాని కలిగించదని కంపెనీ తెలిపింది. అంకర్ పవర్‌వేవ్‌ను 18 నెలల వారంటీతో బ్లాక్ కలర్ వేరియంట్‌లో కొనుగోలు చేయవచ్చు.
also read టెక్ పరిశ్రమలో సంచలనం సృష్టించనున్న వన్‌ప్లస్ కొ-ఫౌండేర్ కొత్త కంపెనీ.. నథింగ్ పేరుతో ప్రారంభం.. ...
గత ఏడాది నవంబర్‌లో కంపెనీ ఫోర్ ఇన్ వన్ యుఎస్‌బి-సి హబ్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. యుఎస్‌బి-సి హబ్ యుఎస్‌బి 2.0 కంటే 10 రెట్లు వేగంగా గాడ్జెట్‌లను చార్జ్ చేస్తుంది. ఈ యుఎస్‌బి-సి హబ్ ధర రూ .3,299. అమెజాన్ తో పాటు ఇతర రిటైల్ స్టోర్ లలో లభిస్తుంది.
యాంకర్ 4 ఇన్ 1 హబ్ కనెక్టివిటీ స్టేషన్ నుండి ఒకేసారి మల్టీ డివైజెస్ ఛార్జ్ చేయగలదు. మాక్ బుక్ ప్రో, ఐమాక్ ప్రో, గూగుల్ క్రోమ్ బుక్ పిక్సెల్‌ల కోసం రూపొందించారు. దీని పవర్ డెలివరీ 60 వాట్స్, దీని ద్వారా మీరు యుఎస్‌బి-సి, యుసిబి-ఎ కనెక్టివిటీతో డివైజ్ ఛార్జ్ చేయవచ్చు.