న్యూఢిల్లీ: ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ కొత్త, బడ్జెట్ ధర స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధం వుతోంది. ప్రస్తుతం ‘ఐఫోన్9’ పేరుతో ఉన్న ‘ఎస్ఈ2’ మోడల్‌గా ఈ ఫోన్‌ను ఏప్రిల్ 15న విడుద‌ల చేసేందుకు ఆపిల్ సిద్ధ‌మవుతున్న‌ట్లు తెలిసింది. 

అనుకున్న మేరకు ఆవిష్కరణ పూర్తయితే ఈ నెల 22వ తేదీ నుంచే వినియోగదారులకు ఐఫోన్ ‘ఎస్ఈ2’ ఫోన్  లభ్యం కానుంది. ఐఫోన్ ‘ఎస్ఈ2’ ఫోన్ కోసం ఐఫోన్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

కానీ కరోనా వైరస్ సంక్షోభంతో విడుదల వాయిదా పడింది. నిజానికి గత నెల 31వ తేదీనే మార్కెట్లో విడుదల అవుతుందని అంతా భావించారు. కోవిడ్ -19 ఆందోళన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆపిల్ వాయిదా వేసింది.

4.7- 5.5 అంగుళాల డిస్ ప్లే సైజుల్లో అతి చవక ధరలో ఐఫోన్ ప్రేమికులకు అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌పై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఐఫోన్ 8 తరహాలోనే ఐఫోన్ ఎస్ఈ 2లో డిస్‌ప్లేను ఏర్పాటు చేసింది. 

తెలుపు, నలుపు, ఎరుపు మూడు రంగల్లో లాంచ్ కానున్న ఈ ఐఫోన్ లో 3డీ ట‌చ్‌ను జోడించిందని వార్తలొచ్చాయి. ఐఫోన్ ఎస్ఈ2 మోడల్ ఫోన్‌లో ఫేస్ ఐడీ ఫీచ‌ర్‌ చేర్చలేదని సమాచారం. 

also read:ఒక్కటైన యాపిల్, గూగుల్​.. కరోనాకు ఇక ‘స్మార్ట్’గా చెక్

ఇక రూ.30 వేల లోపు ధ‌ర‌కే విక్ర‌యించాల‌ని ఆపిల్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందుకు గాను ఆయా దేశాల్లో ఉన్న త‌మ ఆధికారిక డీల‌ర్ల‌తో యాపిల్ ఇప్ప‌టికే సంప్రదింపులు పూర్తి చేసింది. అయితే ఈ విష‌యంపై స్ప‌ష్ట‌తకు మరో నాలుగురోజులు వేచి చూడ‌క తప్ప‌దు.

యాపిల్ ఐఫోన్ ఎస్ఈ2 ఫోన్‌లో 4.7 అంగుళాల డిస్ ప్లేతోపాటు 13 బయోనిక్ ప్రాసెసర్ చిప్ ఉంటుంది. ప్రాథమికంగా 3 జీబీ ర్యామ్ విత్ 
64 జీబీ స్టోరేజ్‌తో అందుబాటులోకి రానున్నది. ఇంకా 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ సామర్థ్యం కల వర్షన్లు కూడా రానున్నాయి. ఇంకా 12 ఎంపీ కెమెరా, 1960 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ అమర్చుతారని సమాచారం.