Asianet News TeluguAsianet News Telugu

వాట్సాప్‌లో అమేజింగ్ ఫీచర్.. ఇప్పుడు డెస్క్‌టాప్‌లో మజా రెట్టింపు అవుతుంది..

స్టేబుల్ వెర్షన్‌లో ఏదైనా ఫీచర్‌ను ప్రారంభించే ముందు కంపెనీ దానిని బీటా వెర్షన్‌గా కొంత సమయం పాటు పరీక్షిస్తుంది అలాగే ప్రతిదీ సరిగ్గా ఉన్నప్పుడు యూజర్లందరికి విడుదల చేయబడుతుంది.

Amazing feature on WhatsApp, now fun of running WhatsApp on desktop will double
Author
First Published Nov 22, 2022, 7:07 PM IST

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్‌ అందించడానికి లేటెస్ట్ ఫీచర్లు, సౌకర్యాలను ఎప్పటికపుడు  తీసుకొస్తుంటుంది. తాజాగా వాట్సాప్  కాలింగ్ బటన్‌ను  డెస్క్‌టాప్ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది, ఈ ఫీచర్ ఇప్పుడు డెస్క్‌టాప్ వినియోగదారులకి వాయిస్  అండ్ వీడియో కాలింగ్ సౌలభ్యాన్ని పెంచుతుంది. అయితే కంపెనీ ఈ ఫీచర్‌ను బీటా వెర్షన్ లో విడుదల చేసింది. తాజాగా వాట్సాప్ పోల్స్ ఫీచర్‌ను విడుదల చేసింది మీకు తెలిసిందే.

WhatsApp కొత్త ఫీచర్ Windows బీటా వెర్షన్ 2.2240.1.0లో గుర్తించబడింది. ఈ ఫీచర్ కింద వినియోగదారులు మరొక కొత్త సైడ్ బార్‌ను పొందుతారు, దీనిలో చాట్ లిస్ట్, స్టేటస్, సెట్టింగ్‌తో పాటు కాలింగ్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఈ బటన్ సహాయంతో డెస్క్‌టాప్ వినియోగదారులు వాట్సాప్ కాలింగ్‌ను ఆస్వాదించగలరు. టెస్టింగ్ తర్వాత ఈ ఫీచర్‌ను త్వరలో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. 

స్టేబుల్ వెర్షన్‌లో ఏదైనా ఫీచర్‌ను ప్రారంభించే ముందు కంపెనీ దానిని బీటా వెర్షన్‌గా కొంత సమయం పాటు పరీక్షిస్తుంది అలాగే ప్రతిదీ సరిగ్గా ఉన్నప్పుడు యూజర్లందరికి విడుదల చేయబడుతుంది. కొత్త ఫీచర్‌తో వినియోగదారులు కాలింగ్ ట్యాబ్‌లో కాలింగ్ హిస్టరీని చూసే సదుపాయాన్ని కూడా పొందుతారు. వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే WABetaInfo అనే కంపెనీ ఈ ఫీచర్‌ను గుర్తించింది. 

WhatsApp పోల్స్
వాట్సాప్ చాలా కాలంగా పోల్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది, ఇప్పుడు ఈ ఫీచర్ విడుదల చేసింది. WhatsApp పోల్స్ ఇప్పుడు Android అండ్ iOS యాప్‌లలో అంతేకాకుండా  గ్రూప్ చాట్ అండ్ ప్రైవేట్ చాట్ రెండింటికీ WhatsApp పోల్స్ ఉపయోగించవచ్చు. WhatsApp పోల్స్ కోసం యూజర్లు 12 ఆప్షన్స్ పొందుతారు. 

Follow Us:
Download App:
  • android
  • ios