Asianet News TeluguAsianet News Telugu

జాగ్రత్త: అమెజాన్ అనివర్సరీ గిఫ్ట్ పేరుతో వాట్సాప్ లింక్.. ఇందులో నిజం ఎంతంటే ?

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ 30వ వార్షికోత్సవం  ఆఫర్ పేరిట వాట్సాప్‌లో ఒక మెసేజ్ చాలా వైరల్ అవుతోంది. మీలో చాలా మందికి ఈ మెసేజ్ వచ్చి ఉండవచ్చు, కానీ ఈ మెసేజ్ లో నిజం ఎంత అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 

Alert This whatsapp message link of Amazon Anniversary Gift can lull you know the truth
Author
Hyderabad, First Published Mar 27, 2021, 4:02 PM IST

మీకు కూడా ఆన్‌లైన్‌లో గుడ్డిగా షాపింగ్ చేసే అలవాటు ఉంటే మీ స్నేహితుడు లేదా ఎవరైనా  పంపిన లింక్‌పై క్లిక్ చేసి షాపింగ్ చేసే ముందు జాగ్రత్త వహించండి. ఎందుకంటే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ 30వ వార్షికోత్సవం  ఆఫర్ పేరిట వాట్సాప్‌లో ఒక మెసేజ్ చాలా వైరల్ అవుతోంది.

మీలో చాలా మందికి ఈ మెసేజ్ వచ్చి ఉండవచ్చు, కానీ ఈ మెసేజ్ లో నిజం ఎంత అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అయితే అమెజాన్ వార్షికోత్సవ ఆఫర్ గురించి తెలుసుకుందాం.....

అమెజాన్ 30వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతిని ఇస్తోందంటూ వాట్సాప్ లో ఒక మెసేజ్ ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ మెసేజులో  "అమెజాన్ 30వ వార్షికోత్సవ సెలెబ్రేషన్స్  - www.amazon.com నుండి ప్రతిఒక్కరికీ ఉచిత బహుమతులు" అందిస్తుంది.

ఇందుకు కేవలం ఒక నిమిషం మాత్రమే పడుతుంది అలాగే గొప్ప బహుమతిని పొందువచ్చు. బహుమతిగా మీకు 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్‌తో హువావే మేట్ 40 ప్రో 5జి స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది అని చూపిస్తుంది.

also read పోకో సేల్స్ రికార్డ్: 45 రోజుల్లో 5 లక్షల స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు.. దీని ప్రత్యేకత ఏంటంటే ? ...

స్మార్ట్‌ఫోన్‌ గిఫ్ట్ నిజమేనా?
ఈ అమెజాన్ లింక్‌ పై క్లిక్ చేసి  ఫారమ్‌ను నింపిన తరువాత ఒక బాక్స్ బయటకు వస్తోంది. ఇక్కడ మిమ్మల్ని గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయమని కోరుకుంది. బాక్స్ తెరిచాక మీరు ఈ మెసేజ్ ని మీ 20 మంది స్నేహితులతో వాట్సాప్‌లో షేర్ చేయండి లేదా ఐదు గ్రూపులలో షేర్ చేయండి అని అడుగుతుంది. దీని తరువాత ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఆ తర్వాత మీకు బహుమతి లభీస్తుంది అని చూపిస్తుంది.

అలాంటి మెసేజెస్ వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే ?
సైబర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది ఒక రకమైన సైబర్ స్కామ్. దీని ద్వారా మీ వ్యక్తిగత సమాచారం దొంగిలించబడింది. తరువాత దుర్వినియోగం చేయబడుతుంది.

మీరు జాగ్రత్తగా చూస్తే అటువంటి మెసేజులలో వెబ్‌సైట్  యూ‌ఆర్‌ఎల్  స్పెల్లింగ్ లో తప్పు కనిపిస్తుంది దానిని మీరు గుర్తించాలి. మీరు కూడా అలాంటి మెసేజ్ పొందితే వెంటనే దాన్ని తొలగించి, అది స్పామ్ మెసేజ్ అని మీ స్నేహితులకి తెలపండి.

Follow Us:
Download App:
  • android
  • ios