రిలయన్స్ యజమాన్యంలోని ఆన్ లైన్ రిటైల్ స్టోర్ అజియో ఒక కొత్త ఫ్యాషన్ సేల్ తో ముందుకొచ్చింది. ఈ సేల్ సంధర్బంగా డిస్కౌంట్ ఆఫర్ తో పాటు ఇప్పటివరకు చూడని తప్పింపు ధరలు, స్పెషల్ డీల్స్ ఇంకా మరెన్నో అందిస్తోంది.

ట్రెండ్స్‌, సరికొత్త స్టైల్స్‌కు ఖ్యాతిగాంచిన భారతదేశంలోని ప్రముఖ ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ ఈ-రిటెయిలర్‌ అజియో 1 జూలై 2021 నుంచి 5 జూలై 2021 వరకు ఫ్యాషన్‌ శ్రేణి అమ్మకం బిగ్‌ బోల్డ్‌ సేల్‌ నిర్వహిస్తోంది.

పేరుకు తగ్గట్టుగానే ఈ అజియో బిగ్‌ బోల్డ్‌ సేల్‌ ఫ్యాషన్‌కు సంబంధించి ఇప్పటి వరకు లేని భారీ, బోల్డెస్ట్‌ సేల్‌. 2500+ బ్రాండ్లకు చెందిన 6,00,000 స్టైల్స్‌ పై 50-90% వరకు ఆఫ్‌ పొందవచ్చు.

దేశంలోని ప్రతీ కస్టమర్‌ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటి వరకు చూడని ధరలు, ప్రతీ గంటకు స్పెషల్‌ డీల్స్, రివార్డులు, పాయింట్లను అజియో బిగ్‌ బోల్డ్‌ సేల్‌ అందిస్తోంది. 

also read ఆన్‌లైన్‌ లో అమ్మకానికి లింక్డిన్‌ యూజర్ల డేటా.. వ్యక్తిగత వివరాలతో పాటు సాలరీ వివరాలు లీక్‌..!

ప్రపంచఖ్యాతిగాంచిన బ్రాండ్లు నైకీ, ప్యూమా, అడిడాస్‌, లివైస్‌, యూనైటెడ్‌ కలర్స్‌ ఆఫ్‌ బెనెటన్‌కు చెందిన స్టైల్స్‌ అతి తక్కువ ధరలో పొందవచ్చు.

ఈ మెగా ఈవెంట్‌ ద్వారా ఫ్యాషన్‌ ప్రపంచపు సుందరి సోనమ్‌ కపూర్‌, ఫ్యాషన్‌ ఐకాన్స్‌ గురు రణధావ, శృతి హాసన్‌, కాజల్‌ అగర్వాల్‌, మౌనీ రాయ్‌ అమ్మకాలను ఉత్తేజితం చేస్తారు.

ప్రతీ ఒక్కరికీ ఏదో ఒకటి అందించేలా పాపులర్‌ శ్రేణులైన టీ-షర్ట్స్‌, జీన్స్‌, కుర్తాలు, స్నీకర్స్‌పై 50 నుంచి 90% వరకు ఆఫ్‌ సహ అన్ని స్టైల్స్‌పై తగ్గింపు ధరలను చూడవచ్చు. ధరల తగ్గింపు మాత్రమే కాదు ఈ సేల్‌ సందర్భంగా అనేక ప్రముఖ ఇంటర్నేషనల్‌ బ్రాండ్స్‌ను అజియో ప్రారంభిస్తోంది.