Asianet News TeluguAsianet News Telugu

వాయిస్ వైఫైతో కాల్ డ్రాప్స్‌కు తెర.. ఈ ఏడాదిలోనే

ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో తమ కస్టమర్లకు వాయిస్ ఓవర్ వై-ఫై సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అది అందుబాటులోకి వస్తే కాల్ డ్రాప్ సమస్య పరిష్కారమైనట్లేనని చెబుతున్నారు.

Airtel to launch voice over WiFi service in December to tackle call drops
Author
Hyderabad, First Published Dec 4, 2019, 10:46 AM IST

న్యూఢిల్లీ: భారత టెలికం రంగాన్ని ఇటీవల కుదిపేసిన ‘కాల్‌ డ్రాప్‌’ సమస్యకు పూర్తిగా తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెట్‌వర్క్‌ కవరేజీ అంతంత మాత్రంగానే ఉన్నా, వై-ఫై సహాయంతో వాయిస్‌ కాల్స్​ మాట్లాడే వసతిని మనదేశంలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే దిశగా మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు యోచిస్తున్నారు. 

టెలికం రంగాన్ని ఇటీవల కుదిపివేసిన కాల్​ డ్రాప్​ సమస్యను తెరదించే దిశగా అడుగులు వేస్తున్నారు మొబైల్​ సర్వీస్​ ప్రొవైడర్లు. వైఫై సాయంతో వాయిస్​ కాల్స్​ మాట్లాడే వసతిని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు రానున్నారు. 'వో వై-ఫై'గా పిలిచే ఈ టెక్నాలజీని త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

also read బీఎస్ఎన్ఎల్ & ఎంటీఎన్ఎల్ వీఆర్ఎస్ పథకానికి ఫుల్ డిమాండ్

వోవైఫై పూర్తి పేరు ‘వాయిస్‌ ఓవర్‌ వైఫై’. అంటే వైఫై సహాయంతో వాయిస్‌ కాల్స్​ మాట్లాడటం అన్న మాట. మనం ఉన్న ప్రాంతంలో మొబైల్‌ నెట్‌వర్క్‌ కవరేజీ ఎక్కువగా లేకున్నా, సిగ్నల్‌లో పదేపదే హెచ్చుతగ్గులున్నా కాల్‌ మాట్లాడటంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఈ టెక్నాలజీని తీసుకొస్తున్నారు. 

Airtel to launch voice over WiFi service in December to tackle call drops

ఆండ్రాయిడ్‌(గూగుల్‌), ఐవోఎస్‌(యాపిల్‌) ఇప్పటికే అమెరికాలో వోవైఫైని అనుమతిస్తున్నాయి. వోవైఫై కోసం ప్రత్యేకంగా యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోనక్కర్లేదు. వైఫై ఉంటే చాలు. మామూలుగా డయల్‌ ప్యాడ్‌ను ఓపెన్‌ చేసి కాల్‌ చేసుకోవచ్చు. నెట్‌వర్క్‌ కవరేజీ బలహీనంగా ఉంటే వోవైఫై ఆధారంగా కాల్‌ కొనసాగుతుంది. మాట స్పష్టంగా వినబడుతుంది.

also read ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్లో రేటింగ్స్ & రివ్యూస్ కనిపించవు...ఎందుకంటే..?

సాధారణంగా మొబైల్‌ నెట్‌వర్క్‌ రద్దీగా ఉన్నప్పుడు కాల్‌లు కలవడం ఇబ్బందిగా మారుతుంది. కొన్నిసార్లు కలిసినా వాటంతటవే కట్‌ అవుతుంటాయి. సర్వీస్‌ ప్రొవైడర్లతోపాటు వినియోగదారులకూ తలనొప్పిగా మారిన ఈ కాల్‌ డ్రాప్‌ సమస్య వోవైఫై రాకతో తీరే అవకాశముంది.

వాట్సప్‌, స్కైప్‌లతో పనిలేకుండావైఫై అందుబాటులో ఉన్నప్పుడు ఉచితంగా కాల్‌లు చేసుకునే వెసులుబాటును ప్రస్తుతం వాట్సప్‌, స్కైప్‌, ఫేస్‌బుక్‌, మెసెంజర్‌ వంటి యాప్‌లు కల్పిస్తున్నాయి. మొబైల్‌ ఆపరేటర్లు వోవైఫైని వినియోగంలోకి తీసుకొస్తే వినియోగదారులు ఆ యాప్‌లలోకి ప్రవేశించకుండా నేరుగా వైఫైతో ఫోన్‌ మాట్లాడొచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios