Asianet News TeluguAsianet News Telugu

ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్లో రేటింగ్స్ & రివ్యూస్ కనిపించవు...ఎందుకంటే..?

ఆపిల్ తన ఆన్‌లైన్ స్టోర్ నుండి "రేటింగ్స్ & రివ్యూస్" విభాగాన్ని నవంబర్ 17 న తొలగించినట్లు తెలుస్తోంది.ఈ మార్పు యుఎస్‌లోనే కాకుండా యుకె, ఆస్ట్రేలియాలో కూడా అమలు చేయనుంది. గతంలో వినియోగదారుల నుండి రివ్యూస్ మరియు రేటింగ్‌లను కలిగి ఉన్న అన్ని ఆపిల్ ఉత్పత్తులకు ఇది వర్తిస్తుంది.

Apple removed customer reviews and ratings from  online store.
Author
Hyderabad, First Published Nov 30, 2019, 5:41 PM IST

ఆపిల్ తన ఆన్‌లైన్ స్టోర్ నుండి కస్టమర్ రివ్యూస్ మరియు రేటింగ్‌లను తొలగించింది. ఈ మార్పు యుఎస్‌లోనే కాకుండా యుకె, ఆస్ట్రేలియాలో కూడా అమలు చేయనుంది. గతంలో వినియోగదారుల నుండి రివ్యూస్ మరియు రేటింగ్‌లను కలిగి ఉన్న అన్ని ఆపిల్ ఉత్పత్తులకు ఇది వర్తిస్తుంది.

అన్ని కస్టమర్ రేటింగ్‌లు మరియు రివ్యూస్ లను ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్ చాలా కాలం పాటు  "రేటింగ్స్ & రివ్యూస్" విభాగాన్ని కలిగి ఉంది. ఏదైనా ప్రాడక్ట్ కొనుగోలు చేసే ముందు  ఆపిల్ ఉత్పత్తులపై ఇచ్చిన కస్టమర్ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఈ విభాగం వినియోగదారులకు సహాయపడింది.

Apple removed customer reviews and ratings from  online store.

రేటింగ్స్ & రివ్యూస్ విభాగం ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్  ప్రాడక్ట్ లిస్ట్ పేజీలలో కనిపిస్తుంది. ఏదేమైనా ఆపిల్ ఇన్సైడర్ మొదట నివేదించినట్లుగా కుపెర్టినో దిగ్గజం తన ఆన్‌లైన్ స్టోర్ నుండి కస్టమర్ రివ్యూస్ మరియు రేటింగ్‌లను  పూర్తిగా తొలగించింది.గాడ్జెట్ 360 యుఎస్, యుకె మరియు ఆస్ట్రేలియాలోని ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో చేసిన మార్పును ధృవీకరించింది. 

ఆన్‌లైన్ ఆర్చివ్స్ సోర్స్ వేబ్యాక్ మెషిన్ కాష్  డేటా ప్రకారం కొత్త అప్ డేట్ గత వారం జరిగినట్లు కనిపిస్తోంది. నవంబర్ 17 నుండి రేటింగ్స్ & రివ్యూస్ విభాగాన్ని తెసేసినట్టు చూపిస్తుంది.16 అంగుళాల మాక్‌బుక్ ప్రోను ప్రారంభించిన కొద్ది సేపటికే ఆపిల్ ఈ విభాగాన్ని తొలగించి ఉండవచ్చు. అయితే ఈ చర్య  కావాలని తీసేసారా లేక ఇంకేదైనా జరిగిందా అనేది అస్పష్టంగా ఉంది. యాపిల్ సంస్థ గతంలో మాక్‌బుక్ ప్రో మోడళ్లలో కొన్ని ముఖ్యమైన సమస్యలను ఎదుర్కొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios