Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్ జియోకి ఎయిర్‌టెల్ గట్టి షాక్.. తగ్గిపోతున్న ఆక్టివ్ యూజర్లు.. కారణం ఏంటంటే ?

మొబైల్‌ నెట్‌వర్క్‌లో విజిటర్‌ లొకేషన్‌ రిజిష్టర్‌ (వీఎల్‌ఆర్‌) నివేదిక ఆధారంగా యాక్టివ్‌ సబ్‌స్క్రైబర్లు ఎంత మంది ఉన్నారో లెక్కిస్తారు. ఎయిర్‌టెల్‌కు యాక్టివ్‌ యూజర్ల సంఖ్య ఈ ఏడాది జనవరి నాటికి 33.6 కోట్లు కాగా, జియో  యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 32.5 కోట్లకు చేరింది. 

Airtel adds 6.9 million active users in Januar extends gain says  TRAI data
Author
Hyderabad, First Published Mar 22, 2021, 11:54 AM IST

దేశీయ టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ లో  కొత్తగా 69 లక్షల ఆక్టివ్ వినియోగదారులు జనవరిలో  చేరారు. మరోవైపు  జియో  ఆక్టివ్ చందాదారుల సంఖ్య సుమారు 34 లక్షలు తగ్గినప్పటికీ, ఈ లెక్కన ఎయిర్‌టెల్ మార్కెట్ ఆధిక్యాన్ని విస్తరించింది. దీంతో ఎయిర్‌టెల్  ఆక్టివ్ యూజర్ల సంఖ్య 33.6 కోట్లకు పెరిగింది.

మొబైల్‌ నెట్‌వర్క్‌లో విజిటర్‌ లొకేషన్‌ రిజిష్టర్‌ (వీఎల్‌ఆర్‌) నివేదిక ఆధారంగా యాక్టివ్‌ సబ్‌స్క్రైబర్లు ఎంత మంది ఉన్నారో లెక్కిస్తారు. ఎయిర్‌టెల్‌కు యాక్టివ్‌ యూజర్ల సంఖ్య ఈ ఏడాది జనవరి నాటికి 33.6 కోట్లు కాగా, జియో  యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 32.5 కోట్లకు చేరింది. ఇండియాలో అతిపెద్ద టెలికం సంస్థగా కొనసాగుతున్న జియో మొత్తం చందాదార్ల సంఖ్య 41.07 కోట్లు కాగా, రెండవ స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్‌కు 34.46 కోట్లు ఉన్నారు.   

అలాగే వోడాఫోన్ ఐడియా గత 15 నెలల్లో మొదటిసారిగా కొత్త చందాదారులను చేర్చుకోవడం విశేషం.

also read వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ డౌన్: మెసేజులు పంపించడంలో అంతరాయం.. ట్విట్టర్ ద్వారా యూసర్లు కామ...

ఎయిర్‌టెల్‌ కొత్త యూజర్ల చేరికలో బలమైన వృద్ధిని కొనసాగించింది. ఇది రిలయన్స్ జియో కంటే మూడు రెట్లు ఎక్కువ చందాదారులను  సాధించడం గమనార్హం​. 2020 ఆగస్టు నుండి 2021 జనవరి మధ్య దాదాపు 25 మిలియన్ల యూజర్లను ఎయిర్‌టెల్‌ సాధించింది. జియో కేవలం 10 మిలియన్లను ఖాతాదారులను దక్కించుకోగలిగింది.

మొత్తంమీద ఎయిర్‌టెల్ గత ఆరు నెలలుగా జియో కంటే ఎక్కువమంది యూజర్లను తన ఖాతాలో వేసుకుంది.  మొత్తం చందాదారులలో 97 శాతానికిపైగా ఆక్టివ్ గా ఉన్నారు. అయితే  జియోలో కేవలం 79శాతం మాత్రమే ఆక్టివ్ గా ఉన్నారు. 

కంపెనీ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఒక వివరణలో వి‌ఐ‌ఎల్ "ట్రాయి కి సమర్పించిన జనవరి 21న చందాదారుల డేటాలో అనుకోకుండా లోపం ఉందని మేము గుర్తించాము. అలాగే దానిని మేము సరిదిద్దుకున్నాము. సవరించిన డేటాను ట్రాయికి నివేదించాము" అని తెలిపింది.

కంపెనీ స్టేట్మెంట్ లోపం వివరాలను వెల్లడించకపోగా, యుపి (వెస్ట్)  చందాదారుల సంఖ్యలో లోపం ఉన్నట్లు మార్కెట్ పరిశీలకులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios