సాధారణంగా ఖరీదైన వస్తువులు ఆర‍్డర్‌ ఇస్తే డమ్మీ వస్తువులను అందించిన  సంఘటనలు చూసే ఉంటాం. తాజాగా ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.  ఆన్‌లైన్‌లో ఆపిల్‌ పళ్లను ఆర్డర్‌ ఇస్తే ఏకంగా ఖరీదైన ఆపిల్‌ ఐఫోన్‌  వచ్చింది. 

ఆన్‌లైన్ మోసాలకి సంబంధించి చాలా కేసులు మీరు చూసే ఉంటారు. కొంతమంది ఆన్‌లైన్‌లో ఫోన్‌ను ఆర్డర్ చేస్తే వారికి డెలివరీ బాక్స్ లో డమ్మీ ఫోన్లు, రాళ్ళు, ఇతర వస్తువులు అందీంచిన సంఘటనలు కూడా జరిగాయి.

దీంతో ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్‌ చేయకంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ తాజాగా ఇందుకు భిన్నంగా ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్ చెందిన ఒక ఒక వ్యక్తి ఆపిల్‌ పండ్లను ఆర్డర్‌ ఇస్తే ఏకంగా ఖరీదైన ఆపిల్‌ ఐఫోన్‌ వచ్చింది.

 ఒక ఇంగ్లిష్ మీడియా ప్రకారం యూ‌కేలో నివసిస్తున్న 50 ఏళ్ల నిక్ జేమ్స్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ టెస్కో నుండి ఆపిల్‌ పండ్లను ఆర్డర్ చేశాడు. పర్సెల్ అందుకున్న తరువాత ఓపెన్ చేసి చూడగానే ఎగిరి గంతేశాడు.

తాను ఆర్డర్ చేసిన ఆపిల్ పండ్లతో పాటు ఆశ్చర్యకరమైన బాక్స్ పార్సెల్ లో కనిపించింది. ఈ బాక్స్ తెరిచి చూడగా ఇందులో ఆపిల్ ఐఫోన్ ఎస్‌ఈ వచ్చింది. 

also read Telugu News Technology 44ఎంపి సెల్ఫీ కెమెరా, 5జి సపోర్ట్ తో వివో వి సిరీస్ కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పు...

నిక్ జేమ్స్ తన ఆనందాన్ని ట్విట్టర్‌లో వ్యక్తం చేశారు. "మేము ఆపిల్‌ పండ్లను ఆర్డర్ చేస్తే దానికి బదులుగా ఆపిల్ ఐఫోన్ వచ్చింది" అంటూ పోస్ట్ చేశాడు. 

 మొదట ఈస్ట‌ర్ సంద‌ర్భంగా ప్రాంక్ చేశారేమో అనుకుని కొద్దిగా అనుమానించాడు. అయితే టెస్కో కంపెనీ ఇచ్చిన స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌ అని తెలుసుకుని నిక్ జేమ్స్‌ సూపర్‌ థ్రిల్‌ అయ్యాడు. అసలు విషయం ఏమిటంటే టెస్కో గ్రోస‌రీ సంస్థ ప్ర‌మోష‌న‌ల్ క్యాంపేన్‌లో భాగంగా ఆపిల్ పళ్లతో పాటు ఐఫోన్ స్పెష‌ల్ ఎడిష‌న్ ఫోన్‌ను గిఫ్ట్‌గా అతనికి అందించిందట.

'సూపర్ సబ్‌స్టిట్యూట్'లో అవసరమైన వస్తువులను కొనుగోలు చేసిన వినియోగదారులకు ఆపిల్ ఐఫోన్లు, ఎయిర్‌పాడ్స్‌తో పాటు ఇత‌ర ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను ఊహించని బహుమతులుగా అందిస్తోందట టెస్కో సంస్థ.