Asianet News TeluguAsianet News Telugu

జియో గ్లాసెస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది..? దీని ప్రత్యేకత ఎంటో తెలుసా..?

బయటి నుండి చూస్తే జియో గ్లాస్ సాధారణ గాగుల్స్ లాగా కనిపిస్తుంది, అయితే  రాబోయే రోజుల్లో మీ చూపు దృష్టిని మారుస్తుంది. ఈ గ్లాసులను స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు వంటి స్మార్ట్ డివైజెస్ కి సులభంగా కనెక్ట్ చేయవచ్చు. 

5G Launch: What is Jio Glass and how does it work? Know its specialty
Author
First Published Oct 3, 2022, 3:19 PM IST

ఇండియాకి హై-స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ 5Gని గిఫ్ట్ గా అందించడంతో పాటు ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022ని ప్రారంభంలో డెమో జోన్‌లో 5G డివైజెస్ అనుభవాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ పొందారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జియో పెవిలియన్‌కు చేరుకుని జియో గ్లాస్‌ను ధరించి అనుభూతిని చూశారు. నిజానికి జియో గ్లాస్ అనేది ఒక స్మార్ట్ డివైజ్, దీనిని గేమింగ్ అండ్ వినోదం ఇంకా ఎడ్యుకేషన్ కోసం ఉపయోగించవచ్చు. ఈ డివైజ్ గురించి తెలుసుకుందాం...

బయటి నుండి చూస్తే జియో గ్లాస్ సాధారణ గాగుల్స్ లాగా కనిపిస్తుంది, అయితే  రాబోయే రోజుల్లో మీ చూపు దృష్టిని మారుస్తుంది. ఈ గ్లాసులను స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు వంటి స్మార్ట్ డివైజెస్ కి సులభంగా కనెక్ట్ చేయవచ్చు. తర్వాత మీరు దాని సహాయంతో వీడియో స్ట్రీమింగ్ కూడా చేయవచ్చు. ఈ గ్లాసెస్ 2D అలాగే 3D విజువల్స్‌కి సపోర్ట్ చేస్తాయి. ఇందులో (1920X 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ వరకు వీడియోలను ప్లే చేయవచ్చు.  ఆడియో కోసం ఇంటర్నల్ స్పీకర్ కూడా ఉంది. 

జియో గ్లాస్ ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే దీని సహాయంతో కంటెంట్‌ను 50 డిగ్రీల వ్యూ ఫీల్డ్‌లో చూడవచ్చు. Jio Glass కంట్రోలర్ సపోర్ట్ గ్లాసెస్‌తో కూడా అందుబాటులో ఉంది, దీని సహాయంతో  బ్రైట్ నెస్ కూడా కంట్రోల్ చేయవచ్చు. జియో గ్లాస్ హోలోగ్రాఫిక్ కంటెంట్, సాధారణ వీడియో కాన్ఫరెన్సింగ్ అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఈ గ్లాసెస్ సహాయంతో ఎడ్యుకేషన్ మరింత మెరుగుపరుచుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ గ్లాసెస్ ధరించడం ద్వారా విద్యార్థులు 2డి, 3డి విజువల్స్‌తో టాపిక్‌ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. అయితే, మార్కెట్‌లో దీని లభ్యత గురించి కంపెనీ ఇంకా సమాచారం ఇవ్వలేదు. దీన్ని కంపెనీ త్వరలో మార్కెట్లోకి విడుదల చేయవచ్చని భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios