Asianet News TeluguAsianet News Telugu

పబ్-జి మొబైల్ కి పోటీగా త్వరలో ఫౌ-జి గేమ్ లాంచ్: మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ?

ఫౌ-జి గేమ్ ను నవంబర్ తరువాత విడుదల చేయనున్నట్లు కంపెనీ గతంలో ధృవీకరించినప్పటికీ, అధికారిక లాంచ్ తేదీని స్పష్టం చేయలేదు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఫౌ-జి  అందుబాటులో ఉంటుందని ఎన్-కోర్ సంస్థ పేర్కొంది.
 

PUBG Mobile India rival FAU-G game launching soon: Here is all you want to know this game
Author
Hyderabad, First Published Nov 27, 2020, 3:04 PM IST

న్యూ ఢీల్లీ: లక్షలాది మంది ఇండియన్ మొబైల్ గేమర్లు పబ్-జి మొబైల్ ఇండియా గేమ్ లాంచ్ కోసం ఎదురుచూస్తున్నరు. అయితే దేశీయ గేమింగ్ సంస్థ ఎన్-కోర్ కూడా త్వరలో పబ్-జికి పోటీగా ఫౌ-జి గేమ్‌ను ప్రారంభించడానికి సన్నద్ధమవుతోంది.

ఫౌ-జి గేమ్ ను నవంబర్ తరువాత విడుదల చేయనున్నట్లు కంపెనీ గతంలో ధృవీకరించినప్పటికీ, అధికారిక లాంచ్ తేదీని స్పష్టం చేయలేదు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఫౌ-జి  అందుబాటులో ఉంటుందని ఎన్-కోర్ సంస్థ పేర్కొంది.

గతంలో టాప్ గేమింగ్ టైటిల్స్‌పై పనిచేసిన 25 మందికి పైగా ప్రోగ్రామర్లు, ఆర్టిస్టులు, పరీక్షకులు, డిజైనర్ల బృందం ప్రస్తుతం ఫౌ-జి గేమ్‌ను అభివృద్ధి చేస్తోందని భారతీయ గేమింగ్ సంస్థ ఎన్-కోర్ గతంలో తెలిపింది.

మల్టీ-ప్లేయర్ గేమ్ ఫియర్ లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ పేరుతో వస్తున్న ఫౌ-జి గేమ్ పబ్-జి మొబైల్‌కు  ప్రత్యామ్నాయంగా భారతీయ ప్రజలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది,  అయితే కొన్ని రోజుల క్రితం 117 యాప్స్ తో పాటు పబ్-జి గేమ్ ని భారత ప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే.

also read చలికాలంలో ఉపయోగపడే షియోమి హ్యాండ్ వార్మర్ పవర్ బ్యాంక్.. శీతాకాలంలో చేతులను వెచ్చగా.. ...

మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ పబ్-జిని భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2న నిషేధించింది. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు భారతదేశంలోని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ రెండింటి నుంచి తొలగించింది.

 పబ్-జి కార్ప్ ఒక భారతీయ అనుబంధ సంస్థతో  కొత్త గేమ్ సృష్టించి భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశిస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించినప్పటికీ, అధికారిక తేదీని మాత్రం పేర్కొనలేదు.

పబ్-జి మొబైల్ ఇండియా కొత్త వెర్షన్‌లో టైర్ 1 టీమ్ లకు కనీస వేతనం 40వేల నుంచి రూ .2 లక్షల వరకు రూ.6 కోట్ల ప్రైజ్ ఉంటుందని మీడియా నివేదికలు తెలిపాయి.

ఈ నెలలో కొత్త పబ్-జి గేమ్ ప్రారంభించవచ్చని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లపై చాలా పుకార్లు వచ్చాయి. అయితే, కొత్త పబ్-జి గేమ్ ప్రారంభించే తేదీపై ఇంకా అధికారిక నిర్ధారణ లేదని తెలుస్తోంది.   

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పబ్-జి మొబైల్ ఇండియా ఏ‌పి‌కే వెర్షన్ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో శుక్రవారం కొన్ని గంటలు పాటు అందుబాటులో ఉంచారు. ఏ‌పి‌కే వెర్షన్ డౌన్‌లోడ్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాప్పటికి కొంతమంది ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గత శుక్రవారం ఏ‌పి‌కే వెర్షన్ కూడా విడుదల చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios