Asianet News TeluguAsianet News Telugu

పబ్-జి మొబైల్ గేమ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. ఇండియన్ యూసర్ల కోసం లింక్ ద్వారా గేమ్ డౌన్ లోడ్..

పబ్-జి మొబైల్ భారతీయ వినియోగదారుల కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. అంతే కాకుండా ప్రస్తుతం డౌన్‌లోడ్ లింక్ పనిచేయకపోయినప్పటికీ, కంపెనీ పబ్-జి మొబైల్ కోసం డౌన్‌లోడ్ లింక్‌ను ఇండియన్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది.  

PUBG Mobile India APK Download Link Appears on Official Website Check Details here
Author
Hyderabad, First Published Nov 21, 2020, 6:29 PM IST

న్యూ ఢిల్లీ:  ఇండియన్ గేమింగ్ లవర్స్ కి పబ్-జి మొబైల్ గుడ్ న్యూస్ అందించింది. పబ్-జి మొబైల్ భారతీయ వినియోగదారుల కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. అంతే కాకుండా ప్రస్తుతం డౌన్‌లోడ్ లింక్ పనిచేయకపోయినప్పటికీ, కంపెనీ పబ్-జి మొబైల్ కోసం డౌన్‌లోడ్ లింక్‌ను ఇండియన్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది.  

గూగుల్ ప్లే స్టోర్‌తో ఉన్న ఈ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత పబ్-జి మొబైల్ ఇండియా ఫేస్‌బుక్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఇంకా ఐ‌ఓ‌ఎస్ రెండింటి కోసం పబ్-జి మొబైల్ భారతదేశంలో ఎంపిక చేసిన వినియోగదారుల కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

also read ఫేస్‌బుక్ మెసెంజర్‌ వాడుతున్నారా.. జాగ్రత్త కాల్స్ ద్వారా మీ ఫోన్ హ్యాక్ కావొచ్చు.. ...

ఇండియా లోకి పబ్-జి రి-ఎంట్రీ  తరువాత పబ్-జి మొబైల్ హిందీ, ఇంగ్లీష్ భాషలలో మాత్రమే లభిస్తుంది. పబ్-జి మొబైల్ ప్రత్యేక వెర్షన్ భారత మార్కెట్ కోసం రూపొందించింది. భారతీయ గేమింగ్ పరిశ్రమలో పబ్-జి 100 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించిన సంగతి తెలిసిందే.

పబ్-జి మాతృ సంస్థ క్రాఫ్టన్ ఇంక్ భారతదేశంలో 100 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. భారతదేశంలో క్రీడలు, ఇ-స్పోర్ట్స్, వినోదం, ఐటి పరిశ్రమల కోసం ఈ పెట్టుబడి ఉండనుంది.

భారతీయ మార్కెట్లోకి తిరిగి రావడానికి పబ్-జి చైనా కంపెనీ టెన్సెంట్ గేమ్స్‌తో సంబంధాలను తెంచుకుందని  సమాచారం. పబ్-జి మాతృ సంస్థ దక్షిణ కొరియా కంపెనీ క్రాఫ్టన్ ఇంక్, అయితే భారతదేశం, చైనాలో పబ్జి మొబైల్ వ్యాపారం చైనా కంపెనీ టెన్సెంట్ గేమ్స్‌తో ఉంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios