Gen Z పిల్లలు టెక్నాలజీ యుగంలో చాలా అదృష్టవంతులు అని OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వారికి ఎలా ఉపయోగపడుతుంది? AI భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో వివరించారు. ఆయన పంచుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు మీకోసం.

OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ ఒక పాడ్‌కాస్ట్‌లో జెన్-జెడ్ పిల్లలు చాలా లక్కీ అని.. వారికి ఉన్నంత అదృష్టం మరెవరికీ లేదని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భవిష్యత్తులో ఎలా ఉంటుంది? ఎలాంటి మార్పులు వస్తాయి? ఎవరి ఉద్యోగాలు పోతాయి అనే విషయాల గురించి ఆయన మాట్లాడారు. 

ఫార్చూన్ రిపోర్ట్ ప్రకారం.. కొన్ని ఉద్యోగాలు పోతాయి అని OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ అన్నారు. జెన్-జెడ్ పిల్లలు చాలా అదృష్టవంతులని, వాళ్లకు అన్నీ నేర్చుకునే అవకాశం ఉంటుంది అని క్లియో అబ్రహం పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగాలు పోతాయా అనే ప్రశ్నకు.. ఇది ఒక మార్పు.. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని ఆయన సమాధానం ఇచ్చారు.

AI వల్ల మళ్లీ స్కిల్స్ నేర్చుకోవాలి

నేటి యువత ఈ మార్పులకి చాలా త్వరగా అలవాటు పడిపోతారు. 22 ఏళ్ల వాళ్ల గురించి ఆందోళన లేదు కానీ.. 62 ఏళ్ల వాళ్లు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కాస్త కష్టం అవుతుందని సామ్ అన్నారు.

AI వల్ల ఆలోచనలు త్వరగా నిజమవుతాయి

AI యుగం యువతకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ల ఆలోచనలు త్వరగా నిజం చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుంది. యువత ఈ కొత్త టెక్నాలజీకి త్వరగా అలవాటు పడిపోతారు. AI యువతని ఆకర్షిస్తుంది అని OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ పేర్కొన్నారు.

AI వల్ల ఉద్యోగాలు పోతాయా?

OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భవిష్యత్ గురించి సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తపరిచనప్పటికీ.. గూగుల్ మాజీ ఉద్యోగి మాత్రం.. AI వల్ల చాలా ఉద్యోగాలు పోతాయి.. సమాజంలో గందరగోళ పరిస్థితి వస్తుంది.. మధ్యతరగతి ఉనికే ఉండదు అని అన్నారు. AI వైట్-కాలర్ ఉద్యోగాలు లాక్కుంటుందని.. 2027 నాటికి ఉద్యోగ సమస్యలు వస్తాయని తెలిపారు. సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, CEOలు, పాడ్‌కాస్టర్లు ఉద్యోగాలు పోగొట్టుకుంటారు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.