Money Tips: మీ అప్పులన్నీ త్వరగా తీరిపోవాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు!
అప్పు చేయడం సహజం. చదువు, ఆరోగ్యం, ఇళ్లు, పెళ్లి వంటి వాటికోసం మనం అప్పులు చేస్తుంటాం. అప్పు చేయడం ఈజీయే కానీ తీర్చేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి. సరైన ప్లానింగ్ లేకపోతే అప్పు తీర్చడం కష్టం. మరి ఎలా చేస్తే అప్పు త్వరగా తీరుతుందో ఇక్కడ చూద్దాం.

అప్పు త్వరగా తీరాలంటే పాటించాల్సిన చిట్కాలు
అప్పులు అందరూ చేస్తుంటారు. కొందరు అవసరానికి చేస్తే.. మరికొందరు గొప్పలకు పోయి అప్పుల పాలవుతుంటారు. ఇంకొందరికీ అయితే అప్పు తీసుకోవాలన్నా ఆలోచన లేకపోయినా.. ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పడం వల్ల తీసుకుంటూ ఉంటారు. అప్పు తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ తీర్చేటప్పుడు పడే కష్టాలు అన్నీ, ఇన్నీ కావు.
నిజానికి అప్పులు మన జీవితంలో ఒత్తిడిని, ఆందోళనను పెంచుతాయి. కొన్నిసార్లు తక్కువ అప్పు తీసుకున్నా.. సరైన ప్లాన్ తో చెల్లించకపోతే.. అది భారంగా మారవచ్చు. అయితే సరైన ప్లానింగ్ తో తక్కువ టైంలో అప్పులను ఎలా తీర్చాలో ఇక్కడ తెలుసుకుందాం.
అప్పుపై అవగాహన
మనలో చాలామంది చేసే తప్పు ఏంటంటే ప్లానింగ్ లేకుండా అప్పులు కట్టడం. అలా కాకుండా ముందు అప్పు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మొత్తం అప్పు ఎంత ఉంది? నెలకు ఎంత వడ్డీ చెల్లిస్తున్నారు? ఎవరెవరికీ ఎంత డబ్బు ఇవ్వాలి? వంటి విషయాలు, షార్ట్‌టర్మ్, లాంగ్‌టర్మ్ లోన్లు వేర్వేరు చేసి ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి.
ఒక స్పష్టమైన రిపేమెంట్ పద్ధతిని పాటించాలి. 12 నెలల్లో అప్పులన్నీ ఎలా తీర్చాలో ప్లాన్ చేసుకోవాలి. ప్రతి నెల ఎంత కడితే సెట్ అవుతుందో ముందుగా లెక్క వేసుకోవాలి. తద్వారా ఈజీగా అప్పు తీర్చే అవకాశం ఉంటుంది.
నెలవారీ ఖర్చులు
ఆదాయానికి తగ్గట్టుగా మీ బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవాలి. అద్దె, కరెంటు, ఆహారం, బేసిక్ ట్రావెల్ వంటి అవసరమైన ఖర్చులకు కొంత మొత్తాన్ని పక్కన పెట్టాలి. బయట భోజనం, మూవీస్, షాపింగ్ వంటి ఖర్చులను అదుపు చేసుకోవడం మంచిది. ఆదాయంలో కనీసం 25–40 శాతం అప్పు చెల్లించడానికి ఉపయోగించాలి.
అత్యధిక వడ్డీ ఉన్న అప్పులను ముందు తీర్చాలి
అత్యధిక వడ్డీ ఉన్న అప్పులు తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో అప్పు తీసుకోవాల్సి వస్తే.. ముందుగా వాటిని తీర్చడమే మంచిది. క్రెడిట్ కార్డు, వ్యక్తిగత లోన్లు మొదట తీర్చాలి. తర్వాత తక్కువ వడ్డీ ఉన్న బ్యాంక్ లోన్లు, వాహన లోన్లు తీర్చాలి.
ఖర్చుల నియంత్రణ
ఖర్చులు నియంత్రణలో ఉండాలంటే అవసరమైన వస్తువులే కొనుగోలు చేయాలి. నెలవారీ అదనపు ఖర్చులు కట్ చేయాలి. బయట తినడం, కాఫీలు, ఫుడ్ డెలివరీలు తగ్గించడం ఉత్తమం.
EMI లో వస్తువులు కొనడం
ఏదైనా వస్తువు కొనేముందు అది అవసరమో? కాదో నిర్థారించుకోండి. EMI లో వస్తువులు కొనడం తగ్గించుకోండి. UPI వ్యయాలపై మంత్లీ లిమిట్ పెట్టుకోండి.
అదనపు ఆదాయం
అదనపు ఆదాయం కోసం ప్రయత్నించండి. ఫ్రీలాన్స్ వర్క్ చేయండి. (Content Writing, Graphic Design, Online Tutoring) సాయంత్రాల్లో పార్ట్ టైం జాబ్స్ తో పాటు హోమ్ బేకింగ్, కుట్టు పని వంటి వాటితో కూడా డబ్బు సంపాదించవచ్చు. ఈ అదనపు ఆదాయాన్ని అప్పు చెల్లించడానికి వినియోగించండి.
స్ట్రాంగ్ గా ఉండండి
సాధారణంగా అప్పు వల్ల మనకు ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. కాబట్టి మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండండి. అప్పు గురించి తీవ్రంగా ఆలోచిస్తే.. అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ అప్పు తీరదు. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. పర్సనల్ ఫైనాన్స్ బుక్స్ చదవండి.
ఫైనల్ గా..
అప్పుల్లో కూరుకున్నామని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో తక్కువ టైంలోనే అప్పులను పూర్తిగా తీర్చవచ్చు. ముఖ్యంగా ఖర్చులను నియంత్రించడం, ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.