MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Money Saving Tips: లైఫ్ స్టైల్ కొంచెం కూడా చేంజ్ చేయకుండా డబ్బులు సేవ్ చేయొచ్చు.. ఎలాగో తెలుసా?

Money Saving Tips: లైఫ్ స్టైల్ కొంచెం కూడా చేంజ్ చేయకుండా డబ్బులు సేవ్ చేయొచ్చు.. ఎలాగో తెలుసా?

మనం బతకడానికి డబ్బు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తినే తిండి నుంచి కట్టే బట్ట వరకు ప్రతీది డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి డబ్బు పొదుపు చేయడం చాలా ముఖ్యం. మన లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా డబ్బులు పొదుపు చేయొచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Aug 12 2025, 01:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డబ్బు పొదుపు చేసే చిట్కాలు
Image Credit : Gemini

డబ్బు పొదుపు చేసే చిట్కాలు

చాలామంది డబ్బు పొదుపు చేయడం అంటే ఇష్టమైన వాటిని త్యాగం చేయడం అనుకుంటారు. పొదుపు చేయడం వల్ల నచ్చింది తినలేము, ఇష్టమైనవి కొనుక్కోలేము అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా కూడా డబ్బులు పొదుపు చేయవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్మార్ట్ గా ఆలోచించండి
Image Credit : Freepik@jcomp

స్మార్ట్ గా ఆలోచించండి

కొంచెం స్మార్ట్ గా ఆలోచిస్తే మనకి నచ్చినవి చేస్తూనే డబ్బును పొదుపు చేసుకోవచ్చు. మీ నెలవారీ జీతాన్ని.. ఇంటి అద్దె, కిరాణా బిల్లు, కరెంటు బిల్లు వంటి వాటికోసం ఖర్చు పెట్టే ముందు, పొదుపు కోసం కొంత మొత్తాన్ని పక్కకు పెట్టండి. జీతం వచ్చిన వెంటనే పొదుపు అమౌంట్ కట్ అయ్యేలా ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ సెట్ చేసుకోండి. 

రెండు అకౌంట్లు..

వీలైతే రెండు అకౌంట్లు మెయింటేన్ చేయండి. ఒకటి ఖర్చులకు, ఒకటి పొదుపు చేయడానికి. ఖాతాలు వేరుగా ఉంచుకోవడం వల్ల వాటిలోని డబ్బు వాడుకోకుండా ఉండడానికి వీలు ఉంటుంది. సాధారణంగా ఒకటే అకౌంట్ ఉంటే.. ఏదైనా షాపింగ్ కి వెళ్లినప్పుడు మనకు తెలియకుండానే వాటిని ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.

Related Articles

Related image1
ఈ 4 కరెక్టుగా చేస్తే మిమ్మల్ని కోటీశ్వరులు కాకుండా ఎవ్వరూ ఆపలేరు!
Related image2
Money Tips: మీ అప్పులన్నీ త్వరగా తీరిపోవాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు!
35
ఈ ఫార్ములా ఉపయోగించండి
Image Credit : Gemini

ఈ ఫార్ములా ఉపయోగించండి

పొదుపు చేయడం అంటే లైఫ్ స్టైల్ ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. జీతం వచ్చిన వెంటనే ఇంటి అవసరాల (ఆహారం, అద్దె, కరెంట్ వంటివి) కోసం 40 శాతం పక్కన పెట్టండి. 20 శాతం ఇష్టమైన వాటి కోసం (డిన్నర్లు, షాపింగ్, సినిమాలు), 20 శాతం అప్పులు, ఇతర పెట్టుబడుల కోసం, మరో 20 శాతం పొదుపు కోసం పక్కన పెట్టుకోవాలి. పొదుపు డబ్బులను మీ సేవింగ్స్ అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి.

లేట్ ఫీజులు 

లేట్ ఫీజులు అంటే… మనం ఊరికే డబ్బులు చెల్లించడే. కాబట్టి టైంకి బిల్లులు చెల్లించండి. లేదా ఆటో డెబిట్ ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడు తేదీ మర్చిపోయినా అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

45
చిన్న చిన్న ఖర్చులపై దృష్టి పెట్టండి
Image Credit : Gemini

చిన్న చిన్న ఖర్చులపై దృష్టి పెట్టండి

పెద్ద ఖర్చుల కంటే చిన్న చిన్న ఖర్చులే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి చిన్న ఖర్చులపై దృష్టి పెట్టండి. అనవసరమైన రీఛార్జ్ లు, ఉపయోగించని యాప్ సబ్‌స్క్రిప్షన్, ఇంట్లో ఫుడ్ ఉన్నప్పుడు.. బయటి నుంచి ఆర్డర్ పెట్టుకోవడం వంటివి మానేయండి. దానివల్ల కొన్ని డబ్బులు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. వర్క్ ప్లేస్ కు సంబంధించి.. హెల్త్ ఇన్సూరెన్స్, మీల్ కూపన్ల వంటివి ఉపయోగించుకోండి. దానివల్ల వాటికోసం ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.  

55
క్రెడిట్ కార్డు బిల్
Image Credit : Gemini

క్రెడిట్ కార్డు బిల్

ప్రతి నెలా మీ క్రెడిట్ కార్డ్‌ బిల్ పూర్తిగా చెల్లించగలిగితే.. క్యాష్‌ బ్యాక్ లేదా రివార్డ్స్ వంటివి పొందే అవకాశం ఉంటుంది. వాటిని ట్రై చేయండి. అంతేకాదు చాలా బ్యాంక్ యాప్‌లు మీ కొనుగోళ్లను రౌండ్ అప్ చేసి, మిగిలిన చిల్లరను సేవింగ్స్‌లో దాస్తాయి. ఉదాహరణకు రూ. 93 కి ఒక కాఫీ కొన్నారనుకోండి. మిగిలిన 7 రూపాయలు మీ సేవింగ్స్‌లోకి వెళ్తుంది.

సేవింగ్స్ అకౌంట్ మంచిదే. కానీ అది మీ డబ్బును పెద్దగా పెంచదు. దానిలో కొంత భాగాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి తక్కువ రిస్క్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేయండి. తద్వారా మీ డబ్బు పెరుగుతూ పోతుంది.  

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
యుటిలిటీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate: తులం బంగారం రూ.15 లక్షలు అవుతుందా? గోల్డ్ లవర్స్‌కు షాక్!
Recommended image2
Agriculture: లక్షల ఎకరాల భూములు కొంటున్న మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ బాస్‌లు.. అసలు ప్లాన్ ఏంటి?
Recommended image3
మీరు ఇంట్లో ఖాళీగా కూర్చున్నా సరే.. నెలకు రూ. 20 వేల ఆదాయం మీ సొంతం
Related Stories
Recommended image1
ఈ 4 కరెక్టుగా చేస్తే మిమ్మల్ని కోటీశ్వరులు కాకుండా ఎవ్వరూ ఆపలేరు!
Recommended image2
Money Tips: మీ అప్పులన్నీ త్వరగా తీరిపోవాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved