ICC World Cup 2023: ప్రతీకార పోరులో భారత్ కు వరుణుడు కరుణించేనా ? 

IND Vs NZ Semi-Final:వన్డే ప్రపంచ కప్ తుది దశకు చేరుకుంది. నేడు హాట్ ఫేవరేట్ గా బరిలో దిగిన టీమిండియాకు న్యూజిలాండ్ జట్టుకు మధ్య హోరాహోరీ పోరు సాగనున్నది. ఈ ప్రతీకార పోరుకు ముంబాయి లోని వాంఖడే స్టేడియం వేదిక కానున్నది. అటువంటి పరిస్థితిలో వాంఖడేలో వాతావరణం ఎలా ఉండబోతుంది? వరుణుడు కనికరించేనా అనేది సర్వత్రా చర్చనీయంగా మారింది. 

World Cup 2023 INDvsNZ Pitch and Weather report for the semifinal  KRJ

IND Vs NZ Semi-Final: భారతదేశం ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌ లో అడుగుపెట్టింది. భారత్ తో పాటు మరో 3 జట్లు సెమీస్ కు చేరుకున్నాయి. ఈ ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్‌లో భారత్‌ .. న్యూజిలాండ్‌తో తలపడగా.. రెండో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియాతో తలపడనుంది.

కాగా నేడు భారత్‌ న్యూజిలాండ్‌ మధ్య ఉత్కంఠ పోరు మరి గంటల్లో జరుగనున్నది.  ప్రపంచకప్ 2019 సెమీస్ లో 18 పరుగుల తేడాతో ఓడించిన కివీ జట్టుతో రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకోనుని ఫైనల్‌ అడుగుపెట్టాలని భావిస్తుంది. ఈ ప్రతీకార పోరుకు ముంబాయి లోని వాంఖడే స్టేడియం వేదిక కానున్నది. అటువంటి పరిస్థితిలో వాంఖడేలో వాతావరణం ఎలా ఉండబోతుంది? వరుణుడు కనికరించేనా అనేది సర్వత్రా చర్చనీయంగా మారింది. 

వాంఖడేలో వాతావరణం ఎలా ఉంటుంది?

ముంబైలోని వాంఖడే వాతావరణం గురించి మాట్లాడుకుంటే.. వాంఖడేలో వాతావరణం నవంబర్ 15 న స్పష్టంగా ఉంటుందని, వర్షం కురిసే అవకాశం లేదని భావిస్తున్నారు. వాతావరణ వెబ్‌సైట్ Accuweather ప్రకారం.. ముంబైలో వాతావరణం పొడిగా ఉండి.. కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కానున్నది. అలాగే.. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గాలిలో 44 శాతం తేమ ఉంటుందనీ, వర్షం పడే అవకాశం కూడా దాదాపుగా లేదని, మ్యాచ్ జరిగే సమయంలో ఆకాశంలో కనీసం మబ్బులు కూడా ఉండబోవని అధికారులు అంచనా వేశారు. అయితే రాత్రి పూట మంచు తప్పకుండా కురుస్తుంది. అటువంటి పరిస్థితిలో చివరి 10-15 ఓవర్లలో జట్టు బౌలింగ్ సమస్యలను ఎదుర్కొంటుందని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు.  

మ్యాచ్ పూర్తి కాకపోతే ఏమవుతుంది?

ఈ మ్యాచ్‌కు ఎలాంటి రిజర్వ్ డే ఉంచబడలేదు. అటువంటి పరిస్థితిలో.. వర్షం లేదా మరేదైనా కారణాల వల్ల ఆట ఆగిపోతే.. డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం.. రెండు ఇన్నింగ్స్‌లలో కనీసం 20 ఓవర్లు ఆడి మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడానికి అంపైర్ ప్రయత్నిస్తాడు. ఇది కూడా సాధ్యం కాకపోతే ఈ మ్యాచ్ రద్దు చేయబడుతుంది. ఇక భారత జట్టు ఫైనల్ చేరుతుంది. ఎందుకంటే గ్రూప్ దశలో భారత్ అన్ని మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అదే సమయంలో న్యూజిలాండ్ జట్టు ఐదు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది.
 
వాంఖడే పిచ్ ఎలా ఆడుతుంది?

వాంఖడే స్టేడియంలో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలాయించారు. ఈ మైదానంలో బ్యాట్స్‌మెన్‌లు భారీ షాట్‌లు ఆడుతూ పరుగుల వరద పారిస్తారు. అదే సమయంలో పిచ్‌పై మంచి బౌన్స్ కనిపిస్తుంది. దీని కారణంగా భారీ షాట్లు చూడవచ్చు. భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్ లో ఖచ్చితంగా పరుగుల సునామీ వస్తుందని,ఈ మ్యాచులో గెలిచి.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios