బంగ్లాను తుడిచేసిన విండీస్.. 11 వికెట్లతో దెబ్బ తీసిన హోల్డర్

First Published 15, Jul 2018, 1:25 PM IST
west indies cleansweep bangladesh
Highlights

చాలా రోజుల తర్వాత వెస్టిండీస్ తన విశ్వరూపాన్ని చూపింది. సొంతగడ్డపై బంగ్లాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను విండీస్ క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం జరిగిన రెండో టెస్టులో వెస్టీండీస్ 166 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది

చాలా రోజుల తర్వాత వెస్టిండీస్ తన విశ్వరూపాన్ని చూపింది. సొంతగడ్డపై బంగ్లాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను విండీస్ క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం జరిగిన రెండో టెస్టులో వెస్టీండీస్ 166 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగుల భారీ స్కోరు చేసింది... అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా 149 పరుగులకే అలౌట్ అయ్యింది.

అనంతరం విండీస్ తన రెండో ఇన్నింగ్స్‌లో 129 పరుగులకు అలౌటై బంగ్లా ముందు 335 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీనిని ఛేదించేందుకు రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ 42 ఓవర్లలో 168 పరుగలకే చతికిలపడింది. విండీస్ బౌలర్లలో కెప్టెన్ జాసన్ హోల్డర్  బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన హోల్డర్.. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. బంగ్లా బ్యాట్స్‌మెన్‌లలో లిటన్ దాస్ 33, షకిబుల్ హాసన్ 54, ముష్ఫికర్ రహీమ్‌ 31తో చెప్పుకోదగ్గ స్కోరు సాధించారు.

loader