అనుష్కపై కోహ్లి ప్రశంసలు


న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌కు స్పందించిన
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లి ... తన సతీమణి అనుష్క జిమ్‌లో వ్యాయామం
చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Scroll to load tweet…


ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి తన కుటుంబసభ్యులతో సరదాగా
గడుపుతున్నాడు. కుటుంబసభ్యులతో కారులో వెళ్తున్న సమయంలో అనుష్క
లేకుండానే ఓ ఫోటోను ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేశారు . అయితే ఆ సమయంలో నెటిజన్లు
అనుష్కశర్మ గురించి ప్రస్తావించారు.


ఆ ఫోటోలో అనుష్క శర్మ లేకపోవడంపై వారు కోహ్లిపై ప్రశ్నలు గుప్పించారు. 
తాజాగా తన సతీమణి అనుష్కశర్మ జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా కోహ్లి వీడియో తీసి పోస్ట్ చేశాడు.

తన సామర్థ్యాన్ని పెంచుకొనే క్రమంలో మరో ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్నానని ఆయన
చెప్పాడు.తనతో పాటు ఎవరున్నారో చూడాలని సెల్‌ఫోన్ ను వ్యాయామం చేస్తున్న తన
సతీమణి అనుష్కశర్మ మీదికి ఫోకస్ చేశాడు. 

తన కంటే తన భార్యే ఎక్కువగా వ్యాయామం చేస్తోందని చెప్పారు. అంతేకాదు ఆమె చాలా
స్ట్రాంగ్ అంటూ కోహ్లి కితాబిచ్చారు.