ఇటీవల జరిగిన వివాదాస్పద దక్షిణాప్రికా టెస్ట్ సీరీస్ తన భర్తనే కాదు మొత్తం కుటుంబాన్నే దు:ఖంలో ముంచిందని ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్ భార్య కాండిస్ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన టెస్ట్ లో తన భర్త బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అవడం ఎంతగానో బాధ కల్గించిందని గుర్తు చేశారు. అయితే అంతకంటే ఎక్కువ విషాదాన్ని తన కుటుంబంలో ఈ దక్షిణాప్రికా పర్యటన నింపిందని కాండిస్ తెలిపారు.  

దక్షిణాప్రికా సీరీస్ సందర్భంగా తాను కూడా వార్నర్ తో కలిసి వెళ్లానని క్యాండిస్ తెలిపారు. అయితే సిరీస్ మద్యలో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న భర్తతో పాటు తాను కూడా దక్షిణా ఫ్రికా నుంచి ఆస్ట్రేలియాకు తిరిగిరావాల్సి వచ్చిందని క్యాండిస్ తెలిపారు. ఇలా సుధీర్ఘ ప్రయాణం, మానసిక ఆందోళన కారణంగా కడుపులో బిడ్డపై ఒత్తిడి పెరిగి అడార్షనక అయ్యిందని ఓ ఇంటర్వ్యూలో కాండిస్ ఆవేధన వ్యక్తం చేశారు.

ఈ గర్భస్రావం ఎలా జరిగిందో కాండిస్ ఇలా వివరించారు.‘‘తాను బాత్రూంలో ఉండగా.. రక్తస్రావమైంది. దీంతో వెంటనే వార్నర్‌ను పిలిచాను. గర్భస్రావమైందని మాకు అర్థమైంది. మా జీవితాలను ట్యాంపరింగ్ వివాదం ఇంతలా ప్రభావితం చేసి లిటిల్ వార్నర్ ను చిదిమేసింది ’’ అని ఆమె తెలిపింది. 

తమకు ఇప్పటికే ఇద్దరమ్మాయిలు ఉన్నారని మూడోసారి తమకు బాబు పుడతాడని తాము ఆశించినట్లు క్యాండిస్ తెలిపింది. అయితే బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం తర్వాత జరిగిన పరిణామాలు తమ ఆశలను అడియాశలు చేశాయని ఆవేధన వ్యక్తం చేశారు కాండిస్.