వీరేంద్ర సెహ్వాగ్... వీర బాదుడుకు నిలువెత్తు రూపం. అతడు క్రీజులో ఉన్నంతసేపు పరుగుల వరద పారించేవాడు. ఓపెనర్ అంటే మెల్లగా ఇన్నింగ్స్ ను ప్రారంభించాలి అనే సాంప్రదాయ క్రికెట్ టెక్నిక్ ను ఫాలో కాకుండా కొత్త తరహా ఓపెనింగ్ కు నాంది పలికిన క్రికెటర్ సెహ్వాగ్. ఇతడు బ్యాటింగ్ చేస్తూ బలంగా బాదడం వల్ల బంతి కూడా భయపడిపోతుందని అనేక సందర్భాల్లో కామెంటర్లు చమత్కరించేవారు. అలా సెహ్వాగ్ బంతిని బాదాడంటే ఫీల్డర్లు కూడా చూస్తూ ఉండిపోయేవారు. అంత వేగంగా బంతి బౌడరీని తాకేది. ఆలా బౌలర్లకు చుక్కలు చూపించిన సెహ్వాగ్ మాత్రం ఓ బౌలరంటే భయపడేవాడట. అయితే అదే జట్టులోని మరో టాప్ బౌలర్ మాత్రం సెహ్వాగ్ ను చూసి భయపడేవాడట. ఇంతకు ఆ బౌలర్లు ఎవరో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవాల్సిందే.

ఓ వెబ్ సైట్ నిర్వహించిన లైవ్ చాట్ లో పాల్గొన్న సెహ్వాగ్ తన కెరీర్ లోని పలు ఆసక్తికర విషయాలు బైటపెట్టాడు. తాను ఎంతో మంది బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని వారి బౌలింగ్ లో అవలీలగా బౌండరీలు సాధించేవాడినని సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు. కానీ పాకిస్థానీ స్పీడ్ బౌలర్ షోయబ్ అక్తర్ బౌలింగ్ లో మాత్రం అలా చేయలేకపోయేవాడినని...అతడి చేతిలోంచి అత్యంత వేగంగా దూసుకువచ్చే బంతిని చూస్తే భయమేసేదని వివరించారు. అక్తర్ బౌలింగ్ వైవిధ్యంగా ఉండేదని...ఓ సారి యార్లర్ సందింస్తూ కాళ్ల మధ్యలో బౌల్ వేస్తే ఆ వెంటనే మరో బంతిని తలపైకి దూసుకువచ్చేలా వేసేవాడని సెహ్వాగ్ గుర్తు చేశాడు. అతడి బౌలింగ్ వైవిధ్యానికి, స్పీడ్ కు భయపడేవాడినని సెహ్వాగ్ వెల్లడించారు.
ఇక ఇదే కార్యక్రమంలో పాకిస్థాని ఆల్ రౌండర్ షాహిద్ అప్రిది కూడా తన అనుభవాలను పంచుకున్నారు. తన ధనాధన్ బ్యాటింగ్ తో సెహ్వాగ్ బౌలర్లపై విరుచుకుపడేవాడని అఫ్రిది తెలిపాడు. తాను ఎంతోమంది హిట్టర్లకు బౌలింగ్ చేశానని..కానీ సెహ్వాగ్ ఒక్కడికి మాత్రం బౌలింగ్ చేయాలంటే భయపడిపోయేవాడినని అన్నారు. అనుకోకుండానే ఆ భయం పుట్టుకొచ్చేదని అఫ్రిది వివరించారు.
ఇలా ఓ పాకిస్థాని బౌలర్ కు వీరేంద్ర సేహ్వగ్ భయపడితే...అదే పాకిస్థాన్ కు చెందిన మరో బౌలర్ సెహ్వాగ్ కు భయపడేవాడట. ఈ విషయాలను స్వయంగా వారే అభిమానులతో సంచుకున్నారు.