Asianet News TeluguAsianet News Telugu

ఆ రికార్డు బ్రేక్ చేయడం కోహ్లీ ఒక్కడికే సాధ్యం: అజారుద్దీన్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సీరిస్‌‌పై భారత్ ఆశలు వదులోకుండా వుండేలా అడిలైడ్ వన్డే విజయం దోహదపడింది. ఈ గెలుపు ద్వారా మూడు వన్డేల సీరిస్‌లో భారత్, ఆస్ట్రేలియా 1-1 తో సమంగా నిలిచాయి. ఇలా భారత జట్టును ఆసిస్ జట్టుతో పోటీలో వుండేలా చేసింది రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీనే అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా మరోసారి తన అద్భుత ప్రదర్శనతో భారత జట్టును గెలిపించిన కోహ్లీపై మరోసారి మాజీలు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరబాదీ, మాజీ టీంఇండియా కెప్టెన్ అజారుద్దిన్ కూడా కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తారు. 

Virat Kohli will score 100 international hundreds: Azharuddin
Author
Adelaide SA, First Published Jan 16, 2019, 1:38 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సీరిస్‌‌పై భారత్ ఆశలు వదులోకుండా వుండేలా అడిలైడ్ వన్డే విజయం దోహదపడింది. ఈ గెలుపు ద్వారా మూడు వన్డేల సీరిస్‌లో భారత్, ఆస్ట్రేలియా 1-1 తో సమంగా నిలిచాయి. ఇలా భారత జట్టును ఆసిస్ జట్టుతో పోటీలో వుండేలా చేసింది రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీనే అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా మరోసారి తన అద్భుత ప్రదర్శనతో భారత జట్టును గెలిపించిన కోహ్లీపై మరోసారి మాజీలు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరబాదీ, మాజీ టీంఇండియా కెప్టెన్ అజారుద్దిన్ కూడా కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తారు. 

ఇప్పటికే సచిన్ రికార్డులను ఒక్కోటిగా బ్రేక్ చేస్తున్న కోహ్లీ అతడి 100 సెంచరీల మార్కును కూడా ఖచ్చితంగా అతిగమిస్తాడని ఈ  హైదరమాదీ కెప్టెన్ జోస్యం చెప్పారు. అతడు తన పిట్ నెస్ ను కాపాడుకుంటూ, నిలకడగా ఆడితే అందుకు మరెంతో కాలం పట్టదని పేర్కొన్నారు. కోహ్లీ సెంచరీలకు ఓ ప్రత్యేకత వుందని...అతడు సెంచరీ సాధించిన అత్యధిక మ్యాచుల్లో టీంఇండియా విజయం సాధించిందన్నారు. అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే ఓటమిపాలయ్యిందని అజారుద్దిన్ గుర్తు చేశారు.      

ఇక మహేంద్ర సింగ్ ధోని కూడా మరోసారి తాను అత్యత్తమ మ్యాచ్ ఫినిషర్ అని నిరూపించుకున్నాడని అజారుద్దిన్ కొనియాడారు. చివరి నిమిషంలో, అత్యంత ఒత్తిడి సమయంలో వికెట్ కాపాడుకుంటూ విన్నింగ్ షాట్లు కొట్టడం అతడికే చెల్లిందన్నారు. మొత్తంగా భారత్ ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించి ఈ వన్డే విజయాన్ని సాధించారని అజారుద్దిన్ పేర్కొన్నారు. 

అడిలైడ్ లో సాధించిన సెంచరీ ద్వారా కోహ్లీ ఖాతాలో 64 వసెంచరీ చేరింది. వన్డేల్లో 39 సెంచరీలు, టెస్టుల్లో 25 సెంచరీలతో అతడు అత్యధిక  సెంచరీల రికార్డుకు  దగ్గరవుతున్నాడు. ఈ జాబితాలో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్, రికి పాంటింగ్ తర్వాత మూడో స్థానంలో కోహ్లీ వున్నాడు. కోహ్లీ ఇదే జోరు కొనసాగిస్తూ వీరిని అధిగమిస్తాడని క్రికెట్ విశ్లేషకుల మాటలనే మరోసారి అజారుద్దిన్ గుర్తు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios