పంద్రాగస్టు టార్గెట్‌గా కోహ్లీ కొత్త ఛాలెంజ్.. ఇందులో ఏం చేయాలంటే

virat kohli veshbhusha challenge
Highlights

ప్రస్తుతం దేశంలో ఛాలెంజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఫిట్ ఇండియా, కికీ, ఐస్ బకెట్, గ్రీన్ ఛాలెంజ్‌లు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి. ఈ కోవలో మరో ఛాలెంజ్ వచ్చింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దీనికి సృష్టికర్త.

ప్రస్తుతం దేశంలో ఛాలెంజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఫిట్ ఇండియా, కికీ, ఐస్ బకెట్, గ్రీన్ ఛాలెంజ్‌లు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి. ఈ కోవలో మరో ఛాలెంజ్ వచ్చింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దీనికి సృష్టికర్త. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలపై విస్తృత ప్రచారం కల్పించాలని కోహ్లీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా #Veshbhusha ఛాలెంజ్‌ను రూపొందించాడు.

తన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసిన విరాట్.. స్వాతంత్ర్య సంగ్రామంలో స్ఫూర్తిని రగిలించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ సూక్తి.. ‘‘ తుమ్ ముజో కౌన్ దో తుమ్హే అజాదీ దుంగా (మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్ర్యం తెస్తాను) చెబుతూ... చిన్నప్పటి నుంచి మనమంతా ఈ సూక్తులు వింటున్నామని.. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సంప్రదాయ దుస్తులు ధరించి భారత సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటుదామని పిలుపునిచ్చారు.

పంద్రాగస్టు రోజున సంప్రదాయ దుస్తులు ధరించి ఆ ఫోటోలు లేదా వీడియోలను #Veshbhusha ట్యాగ్‌తో అప్‌లోడ్ చేసి  మరో ఇద్దరికి సవాల్ విసరాలని కోహ్లీ పేర్కొన్నాడు. తాను ఓపెనర్ శిఖర్ ధావన్, రిషబ్ పంత్‌లకు #Veshbhusha ఛాలెంజ్‌ను విసురుతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం కోహ్లీ ఫ్యాన్స్ అంతా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు రెడీ  అవుతున్నారు.

 

loader